ప్రస్తుతం తెలుగులో నంబర్ యాంకర్ ఎవరంటే టక్కున గుర్తుకువచ్చే పేరు సుమ. అంతలా పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆమెది కేరళ అయినా తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. తెలుగులో ఎన్నో ప్రోగ్రాంలకు యాంకరింగ్ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు.. ఆమె ఎంతలా తెలుగు నేర్చుకున్నారో. బహుషా తెలుగు మదర్ టంగ్ అయిన వాళ్లు కూడా ఆమెతో పోటీ పడలేరేమో.. అలా ఉంటుంది ఆమె తెలుగు భాష.
అయితే కొన్ని రోజుల క్రితం రాజీవ్ కనకాల, సుమ విడిపోయారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఒకానొక సందర్భంలో వాళ్లు క్లారిటీ కూడా ఇచ్చారు. మా ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని.. అది కాస్త మీడియాకు వెళ్లడంతో వాళ్లు విడపోయారంటూ మీడియా కోడై కూసింది.
పిల్లల్ని విదేశాలకు పంపించి సుమ వేరే ప్లాట్ ఉటుందని.. ఏవేవో కథలు అల్లారు. దానికి తాగాజా ఫుల్ స్టాప్ పెట్టేశారు సుమ అండ్ రాజీవ్. రాజీవ్ కనకాల పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో వాళ్లంతా కలిసి ఆయనతో కేక్ కట్ చేయించారు. ఈ వీడియోను తన ఇన్స్‌స్టా ఖాతాలో షేర్ చేసిన సుమ.. భర్తకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఒకరికి ఒకరు కేక్ తినిపించుకున్నారు.
కేక్ కట్ చేసిన అనంతరం తమ ఇంట్లోనే ఉన్న ఓ వ్యక్తి సుమకు ఆర్డర్ వేశాడు. కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకో అని కాస్త గట్టిగానే అన్నాడు. దీంతో సుమ వెంటనే రాజీవ్ కనకాల కాళ్లకు నమస్కారం చేసింది. అయితే ఈ దృశ్యం చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఏదేమైనా ఈ వీడియోతో పుకార్లు స్పష్టించే వాళ్ల నోర్లు మూయించింది సుమ. ఇక సుమ త్వరలో వెండితెరపై ‘జయమ్మ పంచాయితీ’గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…