భారతీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో దాదాపు చాలామందికి అకౌంట్ ఉంటుంది. ఎక్కువ బ్రాంచ్ లు, ఏటీఎంలు, ఖాతాదారులు కలిగిన బ్యాంక్ గా ఎస్బీఐ ప్రసిద్ధి. అయితే ఇందులో క్రెడిట్ కార్డు వాడే వారి సంఖ్య కూడా పెరిగింది. అయితే ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఎలాంటి చార్జీలు విధించేవారు కాదు.
అంటే ఈఎంఐ విషయంలో ఇలాంటి నిబంధన ఉండేది కాదు. కొన్ని కొన్ని కొనుగోళ్లకు మాత్రం చార్జ్ వసూలు చేసేవారు. అయితే తాజాగా క్రెడిట్ కార్డు వాడే వినియోగదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. ఇక పై ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా చేపట్టిన ఈఎంఐ లావాదేవీలపై రూ.99 ప్రాసెసింగ్ ఫీజు విధించనున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. దాంతో పాటు పన్నులూ వసూలు చేస్తామని తెలిపారు.
ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఒక మెయిల్ ద్వారా చేరవేశారు. అయితే ఇప్పుడే ఈ నిబంధన అమల్లోకి రాదని.. 2021 డిసెంబర్ 1 నుంచి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిబంధన కారణంగా వినియోగదారులపై అదనపు భారం పడుతుందని ఖాతాదారులు వాపోతున్నారు. అకస్మాత్తుగా ఫీజు వసూలు చేసే నిబంధన విధించడం కరెక్ట్ కాదంటూ అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా.. దసరా, దీపావళి ఫెస్టివల్ సందర్భంగా ఈ కార్డును ఉయోగించి అమెజాన్, ఫ్లిప్ కార్డ్ వంటి ఈ కామర్స్ సంస్థల్లో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు డిస్కౌండ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎక్కువగా ఎస్బీఐ కార్డును ఉపయోగించారని సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…