రాజీవ్ కనకాల కాళ్లపై పడిన సుమ.. కారణం ఏంటో తెలుసా..?

0
573

ప్రస్తుతం తెలుగులో నంబర్ యాంకర్ ఎవరంటే టక్కున గుర్తుకువచ్చే పేరు సుమ. అంతలా పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆమెది కేరళ అయినా తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు. తెలుగులో ఎన్నో ప్రోగ్రాంలకు యాంకరింగ్ చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు.. ఆమె ఎంతలా తెలుగు నేర్చుకున్నారో. బహుషా తెలుగు మదర్ టంగ్ అయిన వాళ్లు కూడా ఆమెతో పోటీ పడలేరేమో.. అలా ఉంటుంది ఆమె తెలుగు భాష.

అయితే కొన్ని రోజుల క్రితం రాజీవ్ కనకాల, సుమ విడిపోయారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఒకానొక సందర్భంలో వాళ్లు క్లారిటీ కూడా ఇచ్చారు. మా ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని.. అది కాస్త మీడియాకు వెళ్లడంతో వాళ్లు విడపోయారంటూ మీడియా కోడై కూసింది.

పిల్లల్ని విదేశాలకు పంపించి సుమ వేరే ప్లాట్ ఉటుందని.. ఏవేవో కథలు అల్లారు. దానికి తాగాజా ఫుల్ స్టాప్ పెట్టేశారు సుమ అండ్ రాజీవ్. రాజీవ్ కనకాల పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో వాళ్లంతా కలిసి ఆయనతో కేక్ కట్ చేయించారు. ఈ వీడియోను తన ఇన్స్‌స్టా ఖాతాలో షేర్ చేసిన సుమ.. భర్తకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఒకరికి ఒకరు కేక్ తినిపించుకున్నారు.

కేక్ కట్ చేసిన అనంతరం తమ ఇంట్లోనే ఉన్న ఓ వ్యక్తి సుమకు ఆర్డర్ వేశాడు. కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకో అని కాస్త గట్టిగానే అన్నాడు. దీంతో సుమ వెంటనే రాజీవ్ కనకాల కాళ్లకు నమస్కారం చేసింది. అయితే ఈ దృశ్యం చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఏదేమైనా ఈ వీడియోతో పుకార్లు స్పష్టించే వాళ్ల నోర్లు మూయించింది సుమ. ఇక సుమ త్వరలో వెండితెరపై ‘జయమ్మ పంచాయితీ’గా ప్రేక్షకుల ముందుకు రానుంది.