‘ఇలాచీ టీ’ తాగుతున్నారా.. దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి..?

టీ లల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ఆరోగ్యానికి ఉపయోగపడేవి. మరికొన్ని ఆరోగ్యానికి హాని చేసేంది. ఉపశమనం కోసమో లేదా టైం పాస్ కోసంమో టీ ని చాలా మంది తాగుతారు. సాధారణ టీ ఇలా తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ యాలకలు లేదా ఏలకలు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. యాలకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పాయసం చేయాలన్నా, వెరైటీ వంటలు చేయాలన్నా, పులావ్, బిర్యానీలు వండాలన్నా,ముఖ్యంగా స్వీట్స్ చేయాలాన్నా యాలకలను తప్పనిసరిగా వాడుతారు. ఎందుకంటే యాలకల్లో అద్భుతమైన ఆరోమా వాసన కలిగి ఉంటుంది. ఈ ఆరోమా వాసన వల్లే యాలకలను మసాలా దినుసులన్నింటిలోకి దీన్ని ‘క్వీన్ ఆఫ్ స్పైసెస్ ‘ అని పిలుస్తుంటారు. అద్భుతమైన రుచి, మరియు స్వీట్ ఫ్లేవర్ ను కలిగి ఉండే ఈ యాలకలు మీ వంటలకు అద్భుతమైన రుచి, వాసను అందిస్తాయి.

దీంతో తయారు చేసే టీ మాత్రం.. ఇండియాలో చాలా ఫేమస్. దీన్ని వాడుక భాషలో మనం ‘ఇలాచీ చాయ్’ అంటాం. దీనిలో కొద్దిగా పాలు, పంచదార కలిపి సర్వ్ చేయడం వల్ల చాలా అద్భుతంగా డిఫరెంట్ ఫ్లేవర్ కలిగి ఉంటుంది. యాలకల్లో ఉండే ఆరోమా వాసనకు అద్భుతమైన రుచి తోడవ్వటం వల్లే ప్రపంచంలో మిలియన్ల మంది ఇలాచీ చాయ్ కి దాసోహం అవుతున్నారు. మానసిక ఒత్తిడికి గురైన వారు యాలకల “టీ” తాగితే ప్రశాంతతను పొందుతారు. టీ పొడి తక్కువగానూ, యాలక్కాయలు ఎక్కువగానూ కలిపి టీ తయారు చేస్తున్నపుడు వెలువడే సువాసనను పీల్చడం ద్వారా వల్ల, ఆ టీ తాగడం వల్ల కలిగే నూతనోత్సాహం వల్ల మానసిక ఒత్తిడి త్వరగా నయమైపోతుందట.

తలనొప్పి, వాంతులు మొదలైన సమస్యలు ఉన్నవారికి యాలకుల నోట్లో వేసుకొని నమలడంలోనే నివారణ అభిస్తుంది. భోజనం చేసిన తర్వాత యాలకలతో తయారుచేసిన టీ తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. భోజనం చేసిన వెంటనే ఒక కప్పు యాలకల టీ తాగడం వల్ల బ్యాడ్ బ్రీత్ తగ్గుతుంది, గొంతు తడి ఆరిపోవడం వంటి సమస్యలుండవు. దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లే, ఒక కప్పు ఇలాచీ ఛాయ్ తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు, ముక్కు దిబ్బడ నుండి ఉపశమనం కలుగుతుంది. ఇంకా ఈ టీ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.