Health News

రాత్రి వండిన అన్నం ఉదయం తింటున్నారా.. అయితే ప్రమాదమే.. ఏం జరుగుతుందంటే..!

సద్ది అన్నం తినడం అనేది చాలామందికి అలవాటు ఉంటుంది. అంతే కాకుండా వాటిని రాత్రి వండిన అన్నం ఉదయం తినడమే కాకుండా ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్లకు కూడా పెడతారు. అయితే ఇది ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అన్నం వండిన 2 గంటల తర్వాత వాటిపై బ్యాక్టీరియా చేరుతుంది. అటువంటి సమయంలో ఆ అన్నం తినకపోవడమే మంచిది. అయితే ఆ అన్నాన్ని ఫ్రిజ్ లో పెట్టుకుంటే మాత్రం ఆహారం పాటు కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇంట్లో రాత్రి అన్నం మిగిలితే మరుసటి రోజు ఉదయం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుందని ఓ నివేదికలో పేర్కొన్నారు.

మిగిలిన అన్నం తినడం ఆరోగ్యానికి హానికరం అని చాలా పరిశోధనలు వెల్లడించాయి. నేషనల్ హెల్త్ సర్వీస్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆధారంగా ఇండిపెండెంట్ ఇచ్చిన నివేదికలో మిగిలిన అన్నం తినడం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిపారు. ఫ్రిజ్‌లో ఉంచిన అన్నం కొన్ని గంటల తర్వాత తినవచ్చు. కానీ ఒక రోజు తర్వాత తినకూడదు. అంటే ఎక్కువ గంటలు నిల్వ ఉంచినా.. ఫ్రిజ్ లో ఉంచినా ప్రమాదకరమే. అన్నం కొన్ని గంటలు మాత్రమే ఫ్రిజ్‌లో తాజాగా ఉంటుంది.

అలాగే అన్నం వేడి చేసిన తర్వాత తినాలనుకుంటే ఒక్కసారి మాత్రమే వేడి చేయండి. మళ్లీ మళ్లీ వేడి చేసిన అన్నం తినకూడదు. ఒకసారి వేడి చేసిన ఏ పదార్థం అయినా మళ్లీ మళ్లీ వేడి చేస్తే అందులో ఉండే పోషకాలు నశిస్తాయని నివేదికలో వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

21 minutes ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

30 minutes ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

45 minutes ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

59 minutes ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

1 hour ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

1 hour ago