ప్రస్తుత కరోనా సమయంలో చాలామంది రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా మాంసప్రయులు అయితే చికెన్, మటన్, చేపలు కొనుక్కొని తింటుంటారు. కానీ వెజ్ తినే వారు మాత్రం డ్రైఫ్రూట్స్ ను ఎక్కువగా తింటుంటారు. డ్రైఫ్రూట్స్ ను ఏ రకం ఆహార నియమాలు పాటించేవారు అయినా ఎక్కువగా ఇష్టపడతారు.
డ్రైఫ్రూట్స్ లో కూడా ముఖ్యంగా చెప్పుకునేది ఎండు ద్రాక్ష ఒక్కటి. అయితే ఎండు ద్రాక్షాను చాలా మంది ఇష్టపడరు. కానీ దానిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలను ఇస్తుంది. ఎండు ద్రాక్షను రోజూ వారీ ఆహారంలో తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం.. దీనిని తినడం వల్ల ఒత్తిడి బాగా తగ్గిస్తుంది. పని ఒత్తిడి మెదడుపై ఎక్కువ ప్రభావం చూపించినప్పుడు ఎండు ద్రాక్షను తీసుకోవడం మంచిది.
బరువు తగ్గే వారికి కూడా ఈ ఎండు ద్రాక్ష చాలా ఉపయోగపడుతుంది. శరీరాన్ని బలంగా తయారు చేయడంలో కూడా ఎంతో తోడ్పడుతుంది. దీనిలో కాల్షియం పుష్కలంగా ఉండటంతో ఎముకలకు కూడా చాలా బలం చేకూరుతుంది. చర్మ సమస్యలు కూడా రాకుండా నియంత్రిస్తుంది. జుట్టు రాలడాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. ఏదైనా ఐస్ లాంటి పదర్థాలు తిన్నప్పుడు పళ్లు జివ్వుమంటూ ఇబ్బందిని కలిగిస్తాయి. ఆ సమస్య నుంచి కూడా భయటపడే అవకాశం ఉంటుంది.
ఎండు ద్రాక్షలో ఉండే పొటాషియం, కెటెచిన్లు, విటమిన్ సీ ద్వారా ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి మేలు చేస్తాయి. జలుబు వంటి సీజనల్ వ్యాధులను తగ్గించడంలో ఎండుద్రాక్ష ఎంతో సహయపడుతుంది. ముఖ్యంగా మహిళలకు చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇంకా దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…