సద్ది అన్నం తినడం అనేది చాలామందికి అలవాటు ఉంటుంది. అంతే కాకుండా వాటిని రాత్రి వండిన అన్నం ఉదయం తినడమే కాకుండా ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్లకు కూడా పెడతారు. అయితే ఇది ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్నం వండిన 2 గంటల తర్వాత వాటిపై బ్యాక్టీరియా చేరుతుంది. అటువంటి సమయంలో ఆ అన్నం తినకపోవడమే మంచిది. అయితే ఆ అన్నాన్ని ఫ్రిజ్ లో పెట్టుకుంటే మాత్రం ఆహారం పాటు కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇంట్లో రాత్రి అన్నం మిగిలితే మరుసటి రోజు ఉదయం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుందని ఓ నివేదికలో పేర్కొన్నారు.
మిగిలిన అన్నం తినడం ఆరోగ్యానికి హానికరం అని చాలా పరిశోధనలు వెల్లడించాయి. నేషనల్ హెల్త్ సర్వీస్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆధారంగా ఇండిపెండెంట్ ఇచ్చిన నివేదికలో మిగిలిన అన్నం తినడం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిపారు. ఫ్రిజ్‌లో ఉంచిన అన్నం కొన్ని గంటల తర్వాత తినవచ్చు. కానీ ఒక రోజు తర్వాత తినకూడదు. అంటే ఎక్కువ గంటలు నిల్వ ఉంచినా.. ఫ్రిజ్ లో ఉంచినా ప్రమాదకరమే. అన్నం కొన్ని గంటలు మాత్రమే ఫ్రిజ్‌లో తాజాగా ఉంటుంది.
అలాగే అన్నం వేడి చేసిన తర్వాత తినాలనుకుంటే ఒక్కసారి మాత్రమే వేడి చేయండి. మళ్లీ మళ్లీ వేడి చేసిన అన్నం తినకూడదు. ఒకసారి వేడి చేసిన ఏ పదార్థం అయినా మళ్లీ మళ్లీ వేడి చేస్తే అందులో ఉండే పోషకాలు నశిస్తాయని నివేదికలో వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…