తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి సృష్టించే చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “బాహుబలి” చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”.ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రలో రామ్ చరణ్ సందడి చేయగా కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్ అలరించనున్నారు.
కరోనా పరిస్థితి సద్దుమణిగిన తరువాత తాజాగా ఈ చిత్ర బృందం షూటింగ్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం చివరిదశ షూటింగ్లో పాల్గొన్నారు. అయితే చిత్రీకరణ సమయంలో చిత్రబృందం కాస్త విరామం తీసుకుని ఎంతో సరదాగా వాలీబాల్ ఆడారు. ప్రస్తుతం వాలీబాల్ ఆటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ వేరు వేరు జట్లుగా ఏర్పడి సెట్ లో వాలీబాల్ ఆడారు. తారక్ టీమ్ లో కార్తికేయతో పాటు కాల భైరవ కూడా ఉన్నారు. ఈ విధంగా వీరందరూ కాసేపు సెట్ లో విరామం తీసుకుని వాలీబాల్ ఆడుతూ సరదాగా ఎంజాయ్ చేశారు.
రాజమౌళి సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించినటువంటి చరణ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ సీతమ్మ పాత్రలో సందడి చేయనున్నారు. అదేవిధంగా కొమురంభీం పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ కి జోడీగా ఒలీవియా మోరీస్ సందడి చేయనున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని కీలకపాత్రల్లో కనిపించనున్నారు.ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయడానికి దర్శకుడు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…