వీడియో వైరల్: “ఆర్ఆర్ఆర్” సెట్లో వాలీబాల్ ఆడిన తారక్ ..రాజమౌళి!

0
582

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి సృష్టించే చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “బాహుబలి” చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”.ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రలో రామ్ చరణ్ సందడి చేయగా కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్ అలరించనున్నారు.

కరోనా పరిస్థితి సద్దుమణిగిన తరువాత తాజాగా ఈ చిత్ర బృందం షూటింగ్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం చివరిదశ షూటింగ్లో పాల్గొన్నారు. అయితే చిత్రీకరణ సమయంలో చిత్రబృందం కాస్త విరామం తీసుకుని ఎంతో సరదాగా వాలీబాల్ ఆడారు. ప్రస్తుతం వాలీబాల్ ఆటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ వేరు వేరు జట్లుగా ఏర్పడి సెట్ లో వాలీబాల్ ఆడారు. తారక్ టీమ్ లో కార్తికేయతో పాటు కాల భైరవ కూడా ఉన్నారు. ఈ విధంగా వీరందరూ కాసేపు సెట్ లో విరామం తీసుకుని వాలీబాల్ ఆడుతూ సరదాగా ఎంజాయ్ చేశారు.

రాజమౌళి సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించినటువంటి చరణ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ సీతమ్మ పాత్రలో సందడి చేయనున్నారు. అదేవిధంగా కొమురంభీం పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ కి జోడీగా ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. అజయ్ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని కీలకపాత్రల్లో కనిపించనున్నారు.ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయడానికి దర్శకుడు సన్నాహాలు చేస్తున్నారు.