Rajamouli: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. వేల కోట్ల కలెక్షన్స్ ను సాధించింది. అంతేకాకుండా కలెక్షన్ ల మోత మోగించింది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో విడుదల అయ్యి కోట్లలో కలెక్షన్స్ ను సాధించింది. కాగా సినిమా విడుదల అయ్యి రెండేళ్లు కావస్తోంది.

2022లో రిలీజయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మంచి హిట్ కొట్టి అనేక ఇంటర్నేషనల్ అవార్డులు అందుకొని ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లి బెస్ట్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించి ఇండియన్ సినీ పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాని అనేక దేశాల్లో రిలీజ్ చేసారు. అందులో జపాన్ కూడా ఒకటి. మన ఇండియన్ సినిమాలకు అమెరికా తర్వాత జపాన్ అతిపెద్ద ఇంటర్నేషనల్ మార్కెట్. ముఖ్యంగా తెలుగు సినిమాలకు. దీంతో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యామిలీలతో కలిసి మరీ వెళ్లి ఆర్ఆర్ఆర్ సినిమాని జపాన్ లో ప్రమోట్ చేసారు. ఇప్పటివరకు ఏ సినిమా సాధించని రికార్డు కలెక్షన్స్ జపాన్ లో ఆర్ఆర్ఆర్ సాధించింది.
అంతే కాకుండా జపాన్ ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నారు. జపాన్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజయి రెండేళ్లు అవుతున్నా ఇంకా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి పై అభిమానం చూపిస్తున్నారు. తాజాగా జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాని రీ రిలీజ్ చేశారు. దీంతో రాజమౌళి మరోసారి జపాన్ కి వెళ్లారు. ఇక రాజమౌళి జపాన్ కి వెళ్లడంతో అక్కడి అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ అయ్యాయి. రాజమౌళిని చూసి అభిమానులు సంతోషిస్తున్నారు.
రాజమౌళి కోసం స్పెషల్ గిఫ్ట్
అయితే ఒక బామ్మ రాజమౌళి కోసం స్పెషల్ గిఫ్ట్ చేసుకొచ్చింది. దీంతో రాజమౌళి ఆ గిఫ్ట్ తీసుకొని ఆ బామ్మతో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి.. జపాన్ లో ఆర్గామి క్రేన్స్ అనే గిఫ్ట్ తమకి ఇష్టమైన వాళ్ళ కోసం, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, బాగుండాలని తయారు చేస్తారు. ఒక 83 ఏళ్ళ మహిళ అలాంటివి 1000 తయారుచేసి తీసుకొచ్చి నన్ను ఆశీర్వదించింది. ఆర్ఆర్ఆర్ ఆమెకు సంతోషం ఇచ్చింది. నాకు గిఫ్ట్ పంపి బయట చలిలో ఎదురుచూస్తుంది. ఇలాంటి వాటికి ఋణం తీర్చుకోలేను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసారు. దీంతో రాజమౌళి ట్వీట్ వైరల్ గా మారింది.

































