తమిళ హీరోలలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫాలోయింగ్ తరువాత నటుడు విజయ్ కు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. తమిళంలో బాలనటుడిగా అరంగ్రేటం చేసి స్టార్ హీరోగా కొనసాగుతున్నారు విజయ్.

విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ ప్రముఖ యాక్షన్ దర్శకుడు. ఆయన డైరెక్ట్ చేసిన పలు చిత్రాల్లో విజయ్ బాలనటుడిగా నటించారు. ఆ తర్వాత తన తండ్రి దర్శకత్వంలోనే ‘నాలయై తీర్పు’ సినిమాద్వారా వెండితెరపై అడుగుపెట్టి పలు విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ 1999వ సంవత్సరంలో తాను ప్రేమించిన సంగీతం పెళ్లి చేసుకున్నారు. సంగీత ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన అమ్మాయి. యూకే లో నివసించే సంగీత విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఓ సారి సినిమా షూటింగ్ నిమిత్తం షూటింగ్ స్పాట్ లో విజయ్ ని కలుసుకొని తన అభిమాని అని చెప్పిన సంగీత ఆ తరువాత విజయ్ సినిమా షూటింగ్ జరిగే చోట ఖచ్చితంగా కనిపించేది. ఈ విధంగా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది.

ముందుగా విజయ్ కు సంగీత ప్రపోస్ చేశారు. ఈ విధంగా ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి జరిగింది. ప్రస్తుతం వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు త్వరలోనే విజయ్ కొడుకు హీరోగా అరంగ్రేటం చేయనున్నారు. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో రజినీకాంత్, ప్రభాస్ తర్వాత 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే వారిలో విజయ్ ఒకరు. ప్రస్తుతం విజయ్ ‘బీస్ట్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.






























