Ntr: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి బాలా నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అనంతరం హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇలా నటుడుగా ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నటువంటి ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి హీరోల విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అలవాటును కలిగి ఉంటారు. అయితే ఎన్టీఆర్ లో ఉన్నటువంటి ఈ అలవాటు ఏ టాలీవుడ్ హీరోలకి లేదని అలాంటి ఒక గొప్ప లక్షణం ఎన్టీఆర్ కి మాత్రమే ఉంది అంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.
మరి ఏ హీరోలకి లేనటువంటి ఆ అలవాటు ఎన్టీఆర్ లో ఉన్నది ఏంటి అనే విషయానికి వస్తే సాధారణంగా ఏ సినిమా ఈవెంట్ జరిగిన హీరోలు మాట్లాడుతూ ఉన్న సమయంలో వాళ్ళ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ ఎన్టీఆర్ మాత్రం అభిమానుల గురించి కూడా మాట్లాడతారు. తనను చూడటం కోసం ఎంతోమంది అభిమానులు అక్కడికి తరలివచ్చారు అయితే వీరందరి కోసం ఇంట్లో తమ తల్లిదండ్రులు భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు.
అభిమానుల క్షేమం…
ఇక ఇదే విషయం గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ మీరందరూ నా కోసం ఇక్కడికి ఎంత జాగ్రత్తగా వచ్చారో అంతే జాగ్రత్తగా తిరిగి ఇంటికి వెళ్ళాలి మీకోసం అమ్మానాన్నలు ఎదురుచూస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి అంటూ అభిమానులకు ఈయన ఎన్నో జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. ఇలా ఎన్టీఆర్ అభిమానుల క్షేమాన్ని ఎంతగానో ఆలోచిస్తారని అలా ఏ ఇతర హీరోలు కూడా ఆలోచించరంటూ అభిమానులు ఈ విషయాన్ని మరింత వైరల్ చేస్తున్నారు.



























