హీరో వెంకటేష్ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన రెండో సంవత్సరం అప్పటికే ఆయన కలియుగ పాండవులు, బ్రహ్మ రుద్రులు, భారతంలో అర్జునుడు, అజేయుడు లాంటి చిత్రాలు చేసి ఉన్నారు. 1987లో సుబ్బిరామిరెడ్డి నిర్మాణ సారథ్యంలో మురళీ మోహన్ రావు దర్శకత్వం వహించిన త్రిమూర్తులు సినిమాలో వెంకటేష్, అర్జున్, రాజేంద్ర ప్రసాద్, కుష్బూ, శోభన, అశ్విని హీరో హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ సినిమాలో ఇంతకుముందు ఎప్పుడు ఒక పాటలో గాని ఒక సన్నివేశంలో గాని స్టార్స్ మొత్తం కనబడడం అనేది చూడలేదు.
అభిమానులు ఒక స్టార్ హీరో కనబడితేనే ఈల వేస్తారు. ఇద్దరు స్టార్స్ కనబడితే గోల చేస్తారు. ముగ్గురు స్టార్స్ కనబడితే పండగ చేసుకుంటారు. కానీ అభిమానులు ఊహించనంతమంది సినీ స్టార్స్ తెరపై కనబడితే వారి ఆనందానికి ఇక అంతే ఉండదు. అలాంటి అరుదైన ఫీట్ త్రిమూర్తులు సినిమాలో జరిగింది. త్రిమూర్తులు సినిమాకు నిర్మాతగా సుబ్బిరామిరెడ్డి వ్యవహరించారు.
బాలీవుడ్ లో వచ్చిన “నసీబ్” అనే చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అందరూ తెరపై కనబడతారు. అలాంటి రేర్ ఫీట్ తెలుగులో కూడా చేయాలని సుబ్బిరామిరెడ్డి ఆలోచించి.. ముందుగా ఎన్టీ రామారావు, నాగేశ్వరరావులను సంప్రదించారు. ఏవో కారణాల వలన తాము సినిమాలో నటించలేమని చెప్పారు. కానీ వారి వారసులైన బాలకృష్ణ ,నాగార్జునలను పంపించడం జరిగింది.
త్రిమూర్తులు సినిమాలో “ఒకే మాట..ఒకే బాట..” అనే పాటను హీరో వెంకటేష్ పాడుతూ ఉంటారు. ఆ సందర్భంలో ఆంధ్రా అందగాడు శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ,రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ, యువ సామ్రాట్ నాగార్జున, మురళీమోహన్, చంద్రమోహన్… వీరికి సరిజోడిగ విజయ నిర్మల, శారద, విజయశాంతి, జయమాలిని, రాధా, రాధికలతో పాటుగా పరుచూరి బ్రదర్స్, మిగతా దర్శక, నిర్మాతలు కనబడతారు. వీరితో పాటుగా ఇదే సినిమాలో మల్టీస్టారర్స్ వెంకటేష్, అర్జున్, రాజేంద్ర ప్రసాద్, శోభన, అశ్విని సినిమా మొత్తంగా కనబడడం ఆనాటి ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాలో టాప్ స్టార్స్ కనబడడం అనేది జరగలేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…