Raviteja -Rashmika: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు రవితేజ ఒకరు. కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ఉన్నటువంటి అనంతరం హీరోగా సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా నటుడుగా తనని తాను ఎంతో ప్రూఫ్ చేసుకుంటూ నేడు స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఇప్పటికే 70కి పైగా సినిమాలలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రవితేజ త్వరలోనే మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త హీరోయిన్లతో పని చేసిన ఈయన ఎంతోమందికి సూపర్ హిట్ సినిమాలను అందించారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా కొనసాగుతున్న నటి రష్మిక మందన్న సైతం రవితేజతో నటించే అవకాశాన్ని అందుకున్నారు.
ఇలా రవితేజతో ఈమెకు నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈమె ఆ సినిమా ఛాన్స్ వదులుకున్నారని తెలుస్తుంది. కట్ చేస్తే ఆ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ కావటం విశేషం. మరి రష్మిక రవితేజ కాంబినేషన్లో మిస్ అయిన ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే…
ఛాన్స్ కొట్టేసిన శ్రీ లీల..
త్రినాధ్ రావు నక్కిన డైరెక్షన్లో రవితేజ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం ధమాకా. ముందుగా ఈ సినిమాలో రష్మికను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారట. అయితే అప్పటికే ఈమె పలు సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నేపథ్యంలో డేట్స్ అడ్జస్ట్ కానీ పక్షంలో ఈ సినిమాని వదులుకున్నారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమాకు రష్మిక నో చెప్పడంతో శ్రీ లీల ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…