Mokshagna: నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటికే వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇలా నటుడిగా వరుస సినిమాలలో నటిస్తున్న ఈయన ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
గత మూడు సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇదిగో అదిగో అంటూ చెబుతూనే ఉన్నారు తప్ప ఇప్పటివరకు ఎలాంటి అధికారక ప్రకటన కూడా రాలేదు. ఇకపోతే తాజాగా ఈయన డెబ్యూ మూవీ గురించి ఎన్నో ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉండబోతుందని ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది.
ఇక ఇటీవల ఆషాడం ముగిసి మంచి రోజులు రావడంతో బాలకృష్ణ తన కుమారుడి సినిమా ముహూర్తానికి కూడా సమయం ఫిక్స్ చేశారని తెలుస్తుంది. సెప్టెంబర్ ఒకటవ తేదీ బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 60 సంవత్సరాలు కావడంతో ఘనంగా సత్కరించనున్నారు.
ఖుషీ కపూర్..
ఇక అదే రోజున తన కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీని కూడా బాలయ్య అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా అతిలోకసుందరి వారసురాలు ఖుషి కపూర్ నటించబోతున్నారని వార్త సంచలనంగా మారింది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది ఇదే నిజమైతే ఇక ఈ సినిమాకు తిరుగుండదు. ఇప్పటికే శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జతకట్టిన సంగతి తెలిసిందే. చిన్న కుమార్తె కూడా మరో నందమూరి వారసుడుకి జోడి కట్టబోతున్నారని తెలిసి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…