Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి పరిచయం అవసరం లేని పేరు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన అనంతరం జాతి రత్నాలు సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీగా ఉన్న నవీన్ పోలిశెట్టి ఇటీవల కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే ఈయన అమెరికాలోనే ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా అమెరికాలో ఉంటున్నటువంటి ఈయన ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. నవీన్ పోలిశెట్టికి అమెరికాలో ఉన్న సమయంలో యాక్సిడెంట్ కావడంతో అక్కడే ఉండే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని తెలుస్తోంది.
ఇక తన హెల్త్ అప్డేట్ కి సంబంధించిన విషయాలను కూడా ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా నవీన్ పోలీస్ శెట్టి కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈయన అమెరికాలో సీక్రెట్ గా వివాహం చేసుకున్నారని అందుకే అక్కడే స్థిరపడ్డారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.
పెళ్లి వార్తలు అవాస్తవం..
ఇలా నవీన్ పోలిశెట్టి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారనే వార్త వైరల్ గా మారడంతో ఈ వార్తలపై ఈయన స్పందించి క్లారిటీ ఇచ్చారు.తనకు పెళ్లైనట్లు వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని.. నిజంగా మ్యారేజ్ చేసుకుంటే కచ్చితంగా అందరికీ చెబుతానని పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను మూడు స్క్రిప్ట్లను లైన్లో పెట్టానని తనకు గాయాలు మానయిన వెంటనే తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీ అవుతానని తెలియచేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…