Featured

Kondanda Rami Reddy : ఖైదీ సినిమా విడుదల తర్వాత.. ఆ పాటకు రోడ్డుపై డాన్స్ చేసుకుంటూ పిచ్చోడిలా తిరిగేవాడు.   : కోదండరామిరెడ్డి.

Kondanda Rami Reddy : ఖైదీ 1983లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తొలి చిత్రంతోనే చిత్రసీమలో పేరు శాశ్వతంచేసుకున్న కొన్ని పతాకాలున్నాయి. అడవి రాముడు తీసిన సత్యచిత్ర, వేటగాడు తీసిన రోజా మూవీస్ ఆ కోవకు చెందినవే. ఖైదీ చిత్రంతో సంయుక్త మూవీస్ అటువంటి కీర్తి సంపాదించుకుంది. చిరంజీవి, కోదండ రామిరెడ్డి కాంబినేషన్ ఈ చిత్రంతోనే మొదలయ్యింది. చిరంజీవిని అగ్రనటునిగా, కోదండరామిరెడ్డిని గురువుకి తగ్గ శిష్యునిగా, పరుచూరి సోదరులు ను ప్రముఖ రచయితలుగా నిలిపిన చిత్రం.

ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ..
నెల్లూరుకు చెందిన ధనుంజయరెడ్డి, తిరుపతిరెడ్డి, సుధాకర్ రెడ్డిలు నా దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని అనుకున్నారు. అప్పటికి నేను జ్యోతి చిత్రం చేయడం, ఆ సినిమా సూపర్ హిట్ అవడం జరిగింది. ఆ చిత్రాన్ని చూసిన ప్రముఖ నిర్మాత క్రాంతి కుమార్ నాతో సినిమా తీయాలనుకున్నారు.ఆ క్రమంలో ఒక ప్రముఖ నవల ఆధారంగా “న్యాయం కావాలి” చిత్రాన్ని రూపొందించాం.ఆ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చడంతో మంచి విజయాన్ని సాధించింది.ఆ తర్వాత చిరంజీవితో “అభిలాష” చిత్రాన్ని రూపొందించాము.ఆ సినిమాలో యురేకా సకమిక..అనే పాట యూత్ ని విపరీతంగా కట్టుకుంది. ఆ సినిమా విజయంలో ఆ పాట కీలక భూమికను పోషించింది.నేను నిర్మాతలు చిరంజీవి నెల్లూరు వాసులం కాబట్టి, కలిసివ సినిమా చేస్తే ఎలా ఉంటుందనుకున్నాం.

నిర్మాతల సూచన మేరకు ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ మంచి కథను సిద్ధం చేశారు.అది మా అందరికీ నచ్చడంతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం.అయితే చిరంజీవి ఇచ్చిన డేట్స్ దగ్గర పడడంతో పరుచూరి బ్రదర్స్ వారం రోజుల్లో కథ సంభాషణలు పూర్తి చేశారు.ఈ కథ ఎంత బాగా వచ్చిందో సినిమాలోని పాటలు కూడా చక్రవర్తి అంత బాగా సమకూర్చారు.అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.ఆ రోజుల్లో “రగులుతుంది మొగలి పొద..అనే పాటలో శృంగారం మోతాదు మించిందని ఎలాంటి అభ్యంతరాలు రాలేదా అని యాంకర్ అడగగా.. ఆరోజుల్లో అలాంటి అభ్యంతరాలు ఏవి రాలేదు.అంతకుముందు సినిమాల్లో కాకుండా కొత్తగా ఒక సాంగ్ ఉండాలని మేము అప్పుడు అనుకొని తీసిందే “రగులుతుంది మొగలి పొదా..గుబులుతోంది కన్నె ఎదా.. నాగినిల వస్తున్న..కౌగిలినే ఇస్తున్న.. కాటేస్తావో..మాటేస్తావో…ఓ..ఓ..

ఈ పాటకు ఆ రోజుల్లో కుర్రాళ్లంతా థియేటర్లో ఒకటే ఈలలు,గోలలు.. ఈ పాట సినిమాను మరో స్థాయికి తీసుకువెల్లింది.ఆనాటి స్టార్ హీరోల చిత్రాల కంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్ కి ఈ సినిమా ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా థియేటర్స్ లో నడుస్తున్న సమయంలో.. రోడ్డుపై ఒక అతను ఈ పాటకు నాగిని డాన్స్ చేసుకుంటూ.. చాలాసార్లు కనిపించాడు. అప్పుడు అర్థమైంది ఖైదీ సినిమాలో ఈ పాట ప్రేక్షకులను ఇంతగా ప్రభావితం చేసిందానని. ఇప్పటికీ ఆ పాటకున్న ప్రత్యేకత వేరని ఆ ఇంటర్వ్యూలో దర్శకుడు కోదండరామిరెడ్డి వివరించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago