Kondanda Rami Reddy : ఖైదీ 1983లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తొలి చిత్రంతోనే చిత్రసీమలో పేరు శాశ్వతంచేసుకున్న కొన్ని పతాకాలున్నాయి. అడవి రాముడు తీసిన సత్యచిత్ర, వేటగాడు తీసిన రోజా మూవీస్ ఆ కోవకు చెందినవే. ఖైదీ చిత్రంతో సంయుక్త మూవీస్ అటువంటి కీర్తి సంపాదించుకుంది. చిరంజీవి, కోదండ రామిరెడ్డి కాంబినేషన్ ఈ చిత్రంతోనే మొదలయ్యింది. చిరంజీవిని అగ్రనటునిగా, కోదండరామిరెడ్డిని గురువుకి తగ్గ శిష్యునిగా, పరుచూరి సోదరులు ను ప్రముఖ రచయితలుగా నిలిపిన చిత్రం.
Advertisement
ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరుకు చెందిన ధనుంజయరెడ్డి, తిరుపతిరెడ్డి, సుధాకర్ రెడ్డిలు నా దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని అనుకున్నారు. అప్పటికి నేను జ్యోతి చిత్రం చేయడం, ఆ సినిమా సూపర్ హిట్ అవడం జరిగింది. ఆ చిత్రాన్ని చూసిన ప్రముఖ నిర్మాత క్రాంతి కుమార్ నాతో సినిమా తీయాలనుకున్నారు.ఆ క్రమంలో ఒక ప్రముఖ నవల ఆధారంగా “న్యాయం కావాలి” చిత్రాన్ని రూపొందించాం.ఆ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చడంతో మంచి విజయాన్ని సాధించింది.ఆ తర్వాత చిరంజీవితో “అభిలాష” చిత్రాన్ని రూపొందించాము.ఆ సినిమాలో యురేకా సకమిక..అనే పాట యూత్ ని విపరీతంగా కట్టుకుంది. ఆ సినిమా విజయంలో ఆ పాట కీలక భూమికను పోషించింది.నేను నిర్మాతలు చిరంజీవి నెల్లూరు వాసులం కాబట్టి, కలిసివ సినిమా చేస్తే ఎలా ఉంటుందనుకున్నాం.
నిర్మాతల సూచన మేరకు ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ మంచి కథను సిద్ధం చేశారు.అది మా అందరికీ నచ్చడంతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం.అయితే చిరంజీవి ఇచ్చిన డేట్స్ దగ్గర పడడంతో పరుచూరి బ్రదర్స్ వారం రోజుల్లో కథ సంభాషణలు పూర్తి చేశారు.ఈ కథ ఎంత బాగా వచ్చిందో సినిమాలోని పాటలు కూడా చక్రవర్తి అంత బాగా సమకూర్చారు.అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.ఆ రోజుల్లో “రగులుతుంది మొగలి పొద..అనే పాటలో శృంగారం మోతాదు మించిందని ఎలాంటి అభ్యంతరాలు రాలేదా అని యాంకర్ అడగగా.. ఆరోజుల్లో అలాంటి అభ్యంతరాలు ఏవి రాలేదు.అంతకుముందు సినిమాల్లో కాకుండా కొత్తగా ఒక సాంగ్ ఉండాలని మేము అప్పుడు అనుకొని తీసిందే “రగులుతుంది మొగలి పొదా..గుబులుతోంది కన్నె ఎదా.. నాగినిల వస్తున్న..కౌగిలినే ఇస్తున్న.. కాటేస్తావో..మాటేస్తావో…ఓ..ఓ..
ఈ పాటకు ఆ రోజుల్లో కుర్రాళ్లంతా థియేటర్లో ఒకటే ఈలలు,గోలలు.. ఈ పాట సినిమాను మరో స్థాయికి తీసుకువెల్లింది.ఆనాటి స్టార్ హీరోల చిత్రాల కంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్ కి ఈ సినిమా ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా థియేటర్స్ లో నడుస్తున్న సమయంలో.. రోడ్డుపై ఒక అతను ఈ పాటకు నాగిని డాన్స్ చేసుకుంటూ.. చాలాసార్లు కనిపించాడు. అప్పుడు అర్థమైంది ఖైదీ సినిమాలో ఈ పాట ప్రేక్షకులను ఇంతగా ప్రభావితం చేసిందానని. ఇప్పటికీ ఆ పాటకున్న ప్రత్యేకత వేరని ఆ ఇంటర్వ్యూలో దర్శకుడు కోదండరామిరెడ్డి వివరించారు.
Vishnu Priya: బిగ్ బాస్ హౌస్ అంటేనే పెద్ద ఎత్తున గొడవలు వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఈ సీజన్ లో కూడా కంటెస్టెంట్ల మధ్య ఇలాంటి గొడవలే జరుగుతున్నాయి. ప్రస్తుతం హౌస్ లో కొనసాగుతున్న విష్ణు ప్రియ సోనియా మధ్య భారీ స్థాయిలో వివాదం జరుగుతుంది. సోనియా విష్ణు ప్రియ ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది.
Advertisement
నీకు ఫ్యామిలీ లేదు నాకు ఫ్యామిలీ ఉంది నీలాగా బట్టలు వేసుకుని తిరగలేను అంటూ ఇస్టానుసారంగా మాట్లాడటంతో సోనియా బాగా నెగిటివ్ అవుతుంది. నిజానికి విష్ణు ప్రియ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బిగ్ బాస్ హౌస్లో చేయలేదు. అంతేకాకుండా సోనియా ఫేమస్ అవడం కోసం విష్ణు ప్రియను టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
ఇక విష్ణు ప్రియ గురించి నిఖిల్, అభయ్ దగ్గర మాట్లాడుతూ.. విష్ణుప్రియ రూమ్లో బట్టలు మార్చుకుంటూ ఉంటే ఆదిత్య ఆ రూంలోకి వెళ్లారు. అయన వణుకుతూ బయటకు వచ్చారు.. ఆమె జస్ట్ బ్లౌజ్ లో ఉంది మళ్లీ వచ్చి ఆదిత్య గారు ఆన్ కంఫర్ట్బుల్ గా ఫీల్ చేశాను సారీ సారీ అని చెప్తుంది.
ఆదిత్య ఓం.. నిజానికి ఆదిత్య ఓం అంత అన్ కంఫర్ట్బుల్ ఫీల్ అయ్యారని అతనికి కూడా తెలియకపోవడం గమనించాల్సిన విషయం. సోనియా హౌస్ లో ఫేమస్ అవడం కోసం కేవలం విష్ణు ప్రియ ను టార్గెట్ చేస్తూ రావడంతో ఈమె పట్ల అభిమానులు కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందు తనని హౌస్ నుంచి బయటకు పంపించేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఘటనపై ఈ వారం నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.
Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి జాన్వీ కపూర్. ఇదివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తూ ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Advertisement
ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ముంబైలో ఎంతో ఘనంగా లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ పాత్రలో నటించారు.
ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా జాన్వీ కపూర్ గులాబీ రంగు చీర కట్టుకొని సందడి చేశారు. అయితే ఈమె చీర అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈమె కట్టిన ఈ చీర ఖరీదు ఎంత ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక ఈ వేడుకలో జాన్వీ కపూర్ నచికేత్ బ్రావే డిజైన్ చీరను కట్టారు.
దేవర… ఈ చీర ఖరీదు అక్షరాల రూ. 1,24,850. అలాగే పింక్ శారీకి పెయిర్ అప్ గా చెవులకు జాన్వీ పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ధర రూ. 13 లక్షలని తెలిసిన అభిమానులు ఒకసారిగా షాక్ అవుతున్నారు. ఇలా సెలబ్రిటీలు బ్రాండెడ్ దుస్తులను ధరించడం సర్వసాధారణం. ఇక దేవర సినిమా ద్వారా మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈమె ఈ సినిమా ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
Star Anchor: సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా వారి చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిమానులు ఆ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు. తాజాగా ఒక యాంకరమ్మ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Advertisement
నాట్యం మయూరిలా ఎంతో చక్కగా నాట్యం చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె అభిమానులు ఈ ఫోటోను మరింత వైరల్ చేస్తున్నారు. మరి ఈ ఫోటోలో ఉన్న ఈమె ఎవరో తెలుసా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్. ఎస్ మీరు గెస్ చేసినది కరెక్టే ఇక్కడ ఉన్నది యాంకర్ సుమ.
సుమా కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ తన తల్లి తండ్రుల ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చారు. ఇక హైదరాబాదులో ఉంటూనే ఈమె ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. మొదట దేవదాస్ కనకాల దర్శకత్వంలో వచ్చిన మేఘమాల సీరియల్ తో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ సమయంలోనే రాజీవ్ కనకాలతో పరిచయం ఏర్పడటం ఆ పరిచయము కాస్త ప్రేమగా మారడం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది.
యాంకర్ సుమ.. ఇలా పెళ్లి తర్వాత కూడా సుమ ఇండస్ట్రీలో పలు సినిమాలు అలాగే సీరియల్స్ లో నటించారు. అనంతరం యాంకర్ గా కూడా మారి ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా ఎంతో బిజీగా కొనసాగుతున్నారు. ఏదైనా ఒక సినిమా వేడుక జరుగుతుంది అంటే కచ్చితంగా ఆ కార్యక్రమంలో సుమ ఉండాల్సిందే. ఆ సినిమా టీజర్ లాంచ్ నుంచి మొదలుకొని సక్సెస్ మీట్ వరకు సుమ పాత్ర ఎంతగానో ఉంటుందని చెప్పాలి.