బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ గురించి అందరికీ తెలిసిందే.ఈమె హౌస్లో అందరితో ఎంతో మంచిగా ఉంటూ 13 వారాల వరకు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగింది. ఇక 13వ వారం ఈమె బిగ్ బాస్ హౌస్ ను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఇలా 13వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన ప్రియాంక సింగ్ రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి.
జబర్దస్త్ కార్యక్రమంలో సాయి తేజగా పరిచయమైన ఈమె సర్జరీ ద్వారా ట్రాన్స్ జెండర్ గా మారారు.అయితే ఇది వరకు సీజన్లలో ట్రాన్స్ జెండర్ గా వచ్చిన వారు మూడు నాలుగు వారాలకు బయటకు వెళ్లారు. కానీ ప్రియాంక సింగ్ తప్పకుండా విన్నర్ రేస్ లో ఉంటారని అందరూ భావించారు. కానీ ఈమె 13వ వారం హౌస్ నుంచి బయటకు వచ్చారు.
ఇక 13వ వారం ఎలిమినేట్ అయిన ప్రియాంక సింగ్ ఎంత తీసుకుంది అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ప్రియాంక సింగ్ వారానికి 1.75 నుంచి రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రకారం 13 వారాల పాటు ఈమె బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులను సందడి చేసినందుకుగాను నిర్వాహకులు ఈమెకు సుమారు పాతిక లక్షల వరకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రియాంక సింగ్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈమెకు మరింత ఎక్కువగా రెమ్యూనరేషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…