Megastar-Keerthi Suresh: బోళాశంకర్ లో కీర్తి సురేష్ కు భర్తగా యవ హీరో.. ఎవరో తెలుసా..?
Megastar-Keerthi Suresh: మెగాస్టార్ చిరంజీవి వరసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య మూవీ చేస్తున్నారు. చిరంజీవికి జతగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. మరో ముఖ్య పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు. రామ్ చరన్ కు జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
దీంతో పాటు మళయాళంలో మోహన్ లాల్ చేసిన ’లూసిఫర్‘ మూవీని గాడ్ ఫాదర్ గా రిమేక్ చేస్తున్నారు. మరోవైపు మెహర్ రమేష్ డైరెక్షన్ లో ’బోళాశంకర్‘ సినిమా చేస్తున్నారు. మరో రెండు ప్రాజెక్ట్ లను కూడా ప్రకటించారు చిరు. అయితే కుర్రహీరోలకు పోటీగా మెగాస్టార్ వరసగా సినిమాలు చేస్తుండటం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
తాజాగా బోళాశంకర్ మూవీలో చిరంజీవి చెల్లెలుగా ముద్దగుమ్మ కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే మహానటితో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో ఏకంగా చిరంజీవికి చెల్లెలు గా నటిస్తోంది.
తమిళంలో ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు స్టార్ హీరోలకు చెల్లిలి పాత్రల్లో కనిపిస్తోంది. సూపర్ స్టార్ అన్నాత్తే.. తెలుగులో పెద్దన్న సినిమాలో రజినికాంత్ కు చెల్లిలిగా కనిపించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి చెల్లిలిగా బోళా శంకర్ లో కనిపించనుంది. బోళా శంకర్ మూవీ కూడా రిమేక్ చిత్రమే. తమిళంలో అజిత్ చేసిన వేదాళంకు రిమేక్. అయితే ఈసినిమా నుంచి ఓ కొత్త అప్డెట్ వచ్చింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ కు భర్తగా యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈవిషయంపై చిత్ర యూనిట్ నుంచి మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…