Categories: Featured

Nagarjua – Roja Combo : నాగార్జున.. రోజాతో నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి.!!

చిత్ర, విచిత్రాలకు కేంద్రబిందువు సినీ పరిశ్రమ. నటీనటుల విషయానికి వస్తే వారి కలయిక కూడా విచిత్రంగా జరుగుతుంది. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ సినిమాలను గమనిస్తే.. ఇందులో నటించిన కొన్ని కాంబినేషన్స్ సినిమా మొదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ పెరుగుతుంది. మరి కొన్ని కాంబినేషన్స్ కలిసిన మొదటి చిత్రం తోనే బాక్స్ ఆఫీస్ కు షాక్ ఇస్తుంది. హీరో లేదా హీరోయిన్ ఒక సినిమాలో లో గెస్ట్ అప్పియరెన్స్ లేదా సినిమా మొత్తం కనిపించిన ఆ సినిమా విజయవంతమైన సందర్భాలు ఉన్నాయి.

హీరో నాగార్జున తన కెరీర్ బిగినింగ్ నుంచి ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్ ఇచ్చారు. కొత్త దర్శకులను వెండితెరకు పరిచయం చేస్తూ ఎన్నో విజయాలను అందుకున్నారు. అలా 1990 దశకంలో యాక్టివ్ గా ఉన్న హీరోయిన్స్ రమ్యకృష్ణ, మీనా, దివ్యభారతి, నగ్మా, సౌందర్య, ఆమని లాంటి హీరోయిన్స్ తో నటించి నాగార్జున తెలుగు సినీ పరిశ్రమలో దూసుకు వెళ్లారు.. ఈ హీరోయిన్లకు సమకాలీనురాలైన రోజా చిత్తూరు లో పుట్టి పెరిగి నాగార్జున యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు. సినిమాల్లోకి వెళ్లే ఆలోచనతో ఉన్నప్పుడు.. ఆమెది గద్గద స్వరం కావడంతో శ్రేయోభిలాషులు సినీ పరిశ్రమ ప్రవేశానికి నిరాకరించారు.

Nagarjua – Roja Combo : నాగార్జున.. రోజాతో నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి.!!

డాక్టర్ శివప్రసాద్ సహకారంతో రోజా మొదటగా ఛాయాగ్రాహకుడు, దర్శకుడు అయిన ఆర్.కె.సెల్వమణి దర్శకత్వంలో ‘చంభారతి’ చిత్రంలో ప్రశాంత్ సరసన హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత తెలుగులో 1991 శ్రీ సాయి మాధవీ ప్రొడక్షన్స్ ఎన్.శివప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన “ప్రేమ తపస్సు” చిత్రంలో రాజేంద్రప్రసాద్, రోజా హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత అనతికాలంలోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలతో విజయవంతమైన చిత్రాలు నటించినప్పటికీ.. నాగార్జునతో నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద వెనుతిరిగాయి.

Nagarjua – Roja Combo : నాగార్జున.. రోజాతో నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి.!!

1993 అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని వెంకట్ నిర్మాణం, ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో ‘రక్షణ’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో నాగార్జున, శోభన హీరో హీరోయిన్లుగా నటించారు. రోజా ఈ చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్ గా కనిపించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పరాజయాన్ని పొందింది. ఆ తర్వాత 1995, లక్ష్మీ పద్మజ ఎంటర్ప్రైజెస్, గౌతమ్ కుమార్ నిర్మాణం, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో “వజ్రం” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో నాగార్జున, రోజా హీరో,హీరోయిన్లుగా నటించారు. ఎస్.వి.కృష్ణారెడ్డి కొబ్బరి బొండం,మాయలోడు, రాజేంద్రుడు-గజేంద్రుడు, నెంబర్ వన్, యమలీల వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి జోష్ లో ఉన్నారు. ఆ క్రమంలో ఎస్వీ. కృష్ణారెడ్డి.. 1995లో నాగార్జున, రోజా హీరో, హీరోయిన్లుగా రూపొందించిన ‘వజ్రం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర పరాజయాన్ని మూటగట్టుకుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago