Movie News

‘కీర్తీ సురేష్’ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!!

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను శైలజ సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తీ సురేష్.. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ ని తన అందం, అభినయంతో మెప్పించింది..ఇక ఆ తర్వాత పలు సినిమాలో హీరోయిన్ గా మెరిసిన ఈ అమ్మడు మహానటి మూవీతో ఎనలేని క్రేజ్ తతెచ్చుకోవడమే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది నితిన్ తో కల్సి నటించిన రంగ్ దే సినిమాతో కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ స్టార్ హీరోయిన్ తొలి సంపాదన కేవలం 500 రూపాయలు కావడం విశేషం.చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి, పెద్దయ్యాక హీరోయిన్ గా అవతారం ఎత్తిన కీర్తి సురేష్ తన కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది. పైగా ఈమె పేరెంట్స్ సినిమా రంగానికి చెందిన వారు కావడంతో ఈమెకు తెలుగులో ఆఫర్లు ఈజీగానే వస్తున్నాయి.

చిన్నప్పుడు సినిమాల్లో నటించిన సమయంలో నిర్మాతలు ఇచ్చిన కవర్ ను డాడీకి ఇచ్చే దానినని కీర్తి సురేష్ తాజాగా ఓ ఇంటర్యూలో చెప్పింది. ఆ సమయంలో తనకు నిర్మాతలు ఎంత ఇచ్చారనే విషయం అస్సలు తెలియదని చెప్పింది.అయితే ఫ్యాషన్ డిజైనింగ్ చేసే సమయంలో షోలలో పాల్గొన్నానని ఆ సమయంలో తనకు 500 రూపాయలు ఇచ్చారని అదే తన తొలి పారితోషికం అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.

అలా వచ్చిన 500 రూపాయలను కూడా నాన్నకే ఇచ్చేశానని, ఎందుకంటే నాన్నకు అలా డబ్బులు ఇవ్వడం తనకు సెంటిమెంట్ గా ఉండేదని వివరించింది. అయితే ప్రస్తుతం 2 కోట్ల రూపాయల వరకూ రెమ్యునరేషన్ అందుకునే రేంజ్ కి ఎదిగింది..ఇక మహేష్ బాబు కి జోడిగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ దశలో ఉంది.. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడ్డ ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు… !!

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago