Movie News

‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడో తెలుసా..??

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లను లైన్లో పెడుతున్నాడు..తాజాగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్న బన్నీ..ఆ తర్వాత చేయబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలోనూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రజెంట్ పుష్ప పనుల్లో ఉన్న బన్నీ, నెక్ట్స్ మూవీ ఎవరితో అన్న డిస్కషన్ మొదలైంది. కొరటాల శివతో అనౌన్స్‌ అయిన మూవీ ఇప్పట్లో లేకపోవడంతో బన్నీ నెక్ట్స్ సినిమా ఎవరితో అన్నది ఆసక్తికరంగా మారింది.

మిగతా హీరోలంతా… క్రేజీ మూవీస్‌ లైనప్ చేస్తుంటే బన్నీ నెక్ట్స్ మూవీ డైరెక్టర్‌ ఎవరు? ఇదే ఇప్పుడు ఫిలిం నగర్‌లో మేజర్‌ డిస్కషన్‌. ఆల్రెడీ పుష్ప షూటింగ్ ఫైనల్‌ స్టేజ్‌కు వచ్చేసింది. ఈ టైంలో కోవిడ్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోవటంతో ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టారు బన్నీ.పుష్ఫ షూటింగ్ స్టార్ట్ అయిన టైంలోనే నెక్ట్స్ కొరటాల శివతో సినిమా అంటూ అనౌన్స్ చేశారు అల్లు అర్జున్‌. కానీ సడన్‌గా కొరటాల ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేసి ఎన్టీఆర్‌తో సినిమా కమిట్ అయ్యారు. దీంతో బన్నీ మరో డైరెక్టర్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి.

ఈ టైంలోనూ లాంగ్‌ బ్యాక్‌ అనౌన్స్‌ అయిన ఐకాన్ సినిమా తెర మీదకు వచ్చింది. వకీల్ సాబ్ సూపర్ హిట్ కావటంతో వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో ఐకాన్‌ ను పట్టాలెక్కించే ఛాన్స్ ఉందన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది.మరోవైపు ప్రశాంత్‌నీల్‌తోనూ అల్లు అర్జున్ సినిమా అన్న న్యూస్‌ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది. ప్రజెంట్ ప్రభాస్‌తో సలార్ సినిమా చేస్తున్న ప్రశాంత్ ఈ మధ్య గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లో బన్నీని కలిశారు. అప్పటి నుంచే అల్లు అర్జున్‌తో ప్రశాంత్ మూవీ అన్న ప్రచారం మొదలైంది. కేజీఎఫ్‌ లాంటి సినిమానే జెట్ స్పీడుతో పూర్తి చేసిన ప్రశాంత్..

సలార్‌ను కూడా అక్టోబర్ నాటికి కంప్లీట్‌ చేసేసి బన్నీతో మూవీ స్టార్ట్ చేస్తారని భావిస్తున్నారు. తాజాగా బన్నీ లిస్ట్‌లోకి మరో స్టార్ డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చారు. కోలీవుడ్‌లో వరుస బ్లాక్ బస్టర్స్‌ ఇస్తున్న మురుగదాస్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారన్నది టాలీవుడ్ నయా అప్‌డేట్‌. సోషల్ మేసేజ్‌ను కమర్షియల్ వేలో ప్రజెంట్ చేసే మురుగదాస్… బన్నీ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథను సిద్ధం చేశారట. మరి వీరిలో బన్నీ ఏ డైరెక్టర్ కి ఫస్ట్ ఛాన్స్ ఇస్తాడో చూడాలి..!!

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago