Featured

‘నాగార్జున’ తో కలిసి నటించనున్న మాజీ కేంద్రమంత్రి కూతురు..!!

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవలే ‘వైల్డ్ డాగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే..ఈ సినిమా మన నాగ్ కి మంచి బూస్ట్ ఇచ్చింది.. దీంతో నాగార్జున ఇప్పుడు వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు..ఇందులో భాగంగానే నాగార్జున నటించన ‘సోగ్గాడే చిన్నినాయన’కు సీక్వెల్‌గా బంగార్రాజు అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ‘సోగ్గాడే చిన్నినాయన’ 2015 లో విడుదలై మంచి విజయాన్ని అందించింది.

ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.ఇక ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా మాజీ కేంద్రమంత్రి శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా నటించనుందట. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. అయితే ఎప్పుడో ఈ సినిమా గురించి ప్రకటించగా.. ఇన్నాళ్లు స్క్రిప్టులో పలు మార్పులు చేసి ఫైనల్‌గా ఓకే అయ్యింది.

దీంతో ప్రీప్రొడక్షన్ పనులు మొదలయ్యాయట. అంతా అనుకున్న ప్రకారమే జరిగితే ఈ సినిమా షూటింగ్ జూన్ లేదా జూలై నుండి ప్రారంభం కానుందని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుందట.ఇక అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో NIA నేపథ్యంలో వైల్డ్ డాగ్ అనే సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన వైల్డ్ డాగ్ మార్చ్ 2న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో కొత్త దర్శకుడు అషిషోర్ సోలోమన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది.

అంతేకాదు ఈ సినిమాలో నాగార్జునతో పాటు నటించిన అందరికి మంచి మార్కులే పడ్డాయి. కానీ వసూళ్ల విషయంలో మాత్రం చాలా వెనకబడింది. విడుదలైన రెండు రోజులకే చేతులెత్తేసింది. మ్యాట్నీ ఎంటర్మమెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. నాగార్జునకు జోడిగా హిందీ భామ దియా మీర్జా నటించింది. సయామీ ఖేర్, బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా ఇతర కీలకపాత్రలో కనిపించారు…!!

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago