టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవలే ‘వైల్డ్ డాగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే..ఈ సినిమా మన నాగ్ కి మంచి బూస్ట్ ఇచ్చింది.. దీంతో నాగార్జున ఇప్పుడు వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు..ఇందులో భాగంగానే నాగార్జున నటించన ‘సోగ్గాడే చిన్నినాయన’కు సీక్వెల్‌గా బంగార్రాజు అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ‘సోగ్గాడే చిన్నినాయన’ 2015 లో విడుదలై మంచి విజయాన్ని అందించింది.

ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.ఇక ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా మాజీ కేంద్రమంత్రి శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా నటించనుందట. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. అయితే ఎప్పుడో ఈ సినిమా గురించి ప్రకటించగా.. ఇన్నాళ్లు స్క్రిప్టులో పలు మార్పులు చేసి ఫైనల్‌గా ఓకే అయ్యింది.
దీంతో ప్రీప్రొడక్షన్ పనులు మొదలయ్యాయట. అంతా అనుకున్న ప్రకారమే జరిగితే ఈ సినిమా షూటింగ్ జూన్ లేదా జూలై నుండి ప్రారంభం కానుందని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుందట.ఇక అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో NIA నేపథ్యంలో వైల్డ్ డాగ్ అనే సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన వైల్డ్ డాగ్ మార్చ్ 2న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో కొత్త దర్శకుడు అషిషోర్ సోలోమన్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది.
అంతేకాదు ఈ సినిమాలో నాగార్జునతో పాటు నటించిన అందరికి మంచి మార్కులే పడ్డాయి. కానీ వసూళ్ల విషయంలో మాత్రం చాలా వెనకబడింది. విడుదలైన రెండు రోజులకే చేతులెత్తేసింది. మ్యాట్నీ ఎంటర్మమెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. నాగార్జునకు జోడిగా హిందీ భామ దియా మీర్జా నటించింది. సయామీ ఖేర్, బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా ఇతర కీలకపాత్రలో కనిపించారు…!!
































