Featured

Shilpa Shirodkar : హీరో మహేష్ బాబు వదిన కూడా ఒకప్పుడు తెలుగు తెరపై నటించిన హీరోయిన్ అని మీకు తెలుసా..?!

Shilpa Shirodkar : 1990 దశకం తర్వాత రాఘవేంద్ర రావు గారి పుణ్యమా అని ఇక బాలీవుడ్ నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకోవడం ప్రారంభమయింది. ఇది పూర్తిగా 1990 దశకం లోనే ప్రారంభమయిందని చెప్పలేము. కానీ 1980వ దశకం ప్రారంభంలో స్వల్పంగా మొదలై 1990 దశకం వచ్చేసరికి అత్యధికంగా హిందీ భామలను తెలుగు పరిశ్రమకు దిగుమతి చేసుకోవడం జరిగింది. తెరపై అందాలను ఒలికించడానికి బాంబే నుంచి హీరోయిన్లను దిగుమతి చేయడం అనేది ఒక అలవాటుగా మారింది.

1980 దశకంలో బాలీవుడ్ నటి రతి అగ్నిహోత్రి, ఎన్టీరామారావు తో కలియుగ కృష్ణుడు, ఏఎన్నార్ తో సత్యం శివం, చిరంజీవితో పున్నమినాగు లాంటి సినిమాల్లో కనిపించింది. కృష్ణ హీరోగా నటించిన సింహాసనం లో బాలీవుడ్ నటి మందాకిని కనిపించింది. తరువాత డి.రామానాయుడు చిన్న కొడుకైనా వెంకటేష్ మొదటి చిత్రం కలియుగ పాండవులులో ఆనాటి ముంబై అందాల నటి కుష్బూ హీరోయిన్ గా నటించింది. కానీ 1990 దశకం తర్వాత ఇక ముంబై భామల హవా మరింతగా పెరిగిందని చెప్పవచ్చు. డి.రామానాయుడు నిర్మాణ సారధ్యంలో, బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన బొబ్బిలి రాజా చిత్రంలో హీరోయిన్ గా ముంబైకి చెందిన దివ్యభారతి తీసుకున్నారు. అలాగే 1992లో వచ్చిన ఘరానా మొగుడు చిత్రంలో లో ప్రముఖ హిందీ నటి నగ్మా హీరోయిన్ గా తీసుకున్నారు.

1995 లో వచ్చిన క్రిమినల్ చిత్రంలో ముంబైకి చెందిన మనిషా కొయిరాల నటించారు. 1996 లో వచ్చిన పెళ్లి సందడి చిత్రంలో దర్శకుడు రాఘవేంద్ర రావు రెండవ హీరోయిన్ గా దీప్తి భట్నాగర్ ని తీసుకున్నారు. ఇదే సంవత్సరంలో రాఘవేంద్రరావు సాహస వీరుడు సాగర కన్య చిత్రంలో మళ్లీ ముంబైకి చెందిన శిల్పా శెట్టిని హీరోయిన్ గా తీసుకున్నారు. 1997లో వెంకటేష్ హీరోగా వచ్చిన ప్రేమించుకుందాంరా.. చిత్రంలో అంజలా జావేరి, ఆ తర్వాత ప్రేమంటే ఇదేరా లో ప్రీతి జింత ఇలాంటి ముంబై భామలను ప్రతి సంవత్సరం ఏదో ఒక తెలుగు సినిమాలో నటించడం ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు.

1992లో వచ్చిన శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లో, బి.గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు సరసన శిల్పా శిరోద్కర్ నటించింది. ఈ హీరోయిన్ మహేష్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్న నమ్రతా శిరోద్కర్ కి స్వయానా అక్క. ముసి ముసి నవ్వులలోన…కురిసిన వెన్నెల వాన… అనే పాట ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో మోగుతూనే ఉంటుంది. ఆ పాటలో కనిపించినా శిల్పా శిరోద్కర్ మహేష్ బాబుకి కి వదిన గారని అర్థమవుతుంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago