Featured

Producer MS Raju : ‘వర్షం’ తరవాత ‘వాన’ ఒస్తే.. నిర్మాత ఎమ్మెస్ రాజుకు ఉన్నది కాస్తా ఊడ్చుకుపోయింది..?!

Producer MS Raju : 1990-2000 దశకంలో తెలుగు సినిమా రంగంలో అగ్ర నిర్మాతగా విజయవంతమైన చిత్రాలను రూపొందించిన సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ అధినేత ఎమ్మెస్ రాజు తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్న నిర్మాతల్లో ఒకరు. విక్టరీ వెంకటేష్ తో చిత్రాలు నిర్మించడం మొదలుపెట్టిన ఎమ్మెస్ రాజు సినీ ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ… ఎమ్మెస్ రాజు పేరుతో ప్రేక్షకులు సినిమా థియేటర్ కు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి.

మొదటి చిత్రంతో విజయాన్ని అందిపుచ్చుకున్నారు. ఆ తర్వాత విజయశాంతితో ‘పోలీస్ లాకప్’ సినిమా రూపొందించినప్పటికీ ఆమెతో ‘స్ట్రీట్ ఫైటర్’ సినిమా తీసి చేతులు కాల్చుకున్నారు. ఆ తర్వాత ‘దేవి’ సినిమాతో కొంత ఉపశమనం పొందగా వెంకటేష్ తో రెండోసారి తీసిన చిత్రం ‘దేవి పుత్రుడు’ ఆయనను పునరాలోచించేలా చేసింది. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో ఉదయ్ కిరణ్, రీమాసేన్ హీరో, హీరోయిన్లుగా ‘మనసంతానువ్వే’ చిత్రాన్ని‌ నిర్మించి మరో విజయవంతమైన చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

ఆయన గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ‘ఒక్కడు’ చిత్రం రూపొందించగా..మహేష్ బాబు కెరీర్ లో ఈ చిత్రం మూడవ విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత ఎమ్మెస్ రాజు తెలంగాణ నేపథ్యంలో ఒక ప్రేమకథా చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. ఆ క్రమంలో ఆయన రచయిత వీరుపోట్ల చెప్పిన కథ నచ్చడంతో ప్రభాస్, త్రిష హీరో, హీరోయిన్స్ గా చారిత్రక నేపథ్యం గల వరంగల్, ఆ నగరం చుట్టూ పరిసర ప్రాంతాలను ఆధారం చేసుకుని దర్శకుడు శోభన్ తీసిన చిత్రం “వర్షం” 2004 జనవరిలో విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన గీతాలు యువత గుండెల్లో మార్మోగాయి. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. అనే పాటను స్వరపరిచిన దేవిశ్రీప్రసాద్ కు ఆ రోజుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ పాటకు త్రిష వేసిన స్టెప్పులకు కుర్రకారు పిచ్చెక్కిపోయారు.

అంతటి భారీ విజయాన్ని అందుకున్న ఎమ్మెస్ రాజుకు.. ఆ జ్ఞాపకాలు తన మదిలో నుంచి పోలేదు. దాదాపుగా అదే టైటిల్ తో మళ్లీ వర్షం నేపథ్యంగా మరో చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు.. ఆ క్రమంలో 2008 సుమంత్ ఆర్ట్స్ నిర్మాణం, ఎమ్మెస్.రాజు నిర్మాత, దర్శకత్వంలో ‘వాన’ చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో వినయ్, మీరా చోప్రా హీరో, హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఒక విధంగా వర్షం సినిమాతో పీక్ లో ఉన్న ఎమ్మెస్.రాజు ‘వాన’ సినిమా‌ నిర్మించి చేతులు కాల్చుకున్నారు.

MS Raju : దర్శకుడిగా మారినా ఫలితం దక్కలేదు

‘వర్షం’ చిత్రంతో వచ్చిన డబ్బులు కాస్త..’వాన’ చిత్రంతో ఊడ్చుకు పోయాయి. ఆ తరువాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహిస్తూ.. తన కొడుకు సుమంత్ అశ్విన్ హీరోగా “తూనీగా తూనీగా” చిత్రం తీయగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఎమ్మెస్ రాజు నిర్మాణ బాధ్యతలతో పాటు దర్శకత్వం వహిస్తూ.. శ్రవణ్ రెడ్డి, రుహానిశర్మ,సిమ్రత్ కౌర్ హీరో, హీరోయిన్లుగా”డర్టీ హరి” చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద విజయాన్ని సాధించలేకపోయింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కళ్లద్దాలకు గుడ్‌బై..! లాసిక్‌తో క్లియర్ విజన్ సాధ్యం!

ప్రతిరోజూ కళ్లద్దాలు పెట్టుకోవడం, అవి మసకబారడం లేదా కాంటాక్ట్ లెన్స్‌లతో ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా మందికి సాధారణ సమస్యగా మారింది.…

2 minutes ago

మాటల కంటే మౌనం గొప్పది..! చాణక్యుడి ఐదు కీలక జీవన సూత్రాలు!

ఆచార్యుల బోధనల్లో జీవన విధానానికి సంబంధించిన అనేక సూత్రాలు కనిపిస్తాయి. వాటిలో మాటల నియంత్రణ, సహనం అనే అంశాలు ప్రత్యేకంగా…

10 minutes ago

60 మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. చంద్రమోహన్ రికార్డు..!

సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్‌లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…

2 hours ago

దోస పిండి నిల్వలో చిన్న తప్పు.. పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణం!

దక్షిణ భారతీయుల రోజువారీ ఆహారంలో ఇడ్లీ, దోశలకు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా కోసం చాలామంది…

2 hours ago

డయాబెటిక్ న్యూరోపతి పెరుగుతోంది.. కారణాలు, నివారణ మార్గాలు తెలుసుకోండి!

మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…

2 hours ago

నడుము నొప్పి బాధిస్తుందా? గంటల తరబడి కూర్చోవడం ప్రమాదం.. బ్యాక్ పెయిన్ తగ్గించే సింపుల్ టిప్స్!

నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…

5 hours ago