Oye: నటుడు సిద్ధార్థ్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే ఈయన బేబీ షామిలి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ నటించినటువంటి మొట్టమొదటి చిత్రం ఓయ్ ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు ఇక ఈ సినిమాలో నటుడు సిద్ధార్థ హీరోగా నటించారు.
ఈ సినిమాకు ఆనంద్ రంగా డైరెక్టర్ గా పని చేశారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి కథ సంగీతం ఉన్నప్పటికీ ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 2009వ సంవత్సరంలో విడుదల అయినా ఈ సినిమా తిరిగి మరోసారి ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ఈ సినిమా గురించి డైరెక్టర్ పలు విషయాలను వెల్లడించారు. ఇక ఈ సినిమాలో సంధ్య పాత్రలో నటించిన షామిలి హీరో సిద్ధార్థ్ ను ఓయ్ అంటూ పిలుస్తూ ఉంటారు. ఇలా తనని ఓయ్ అని పిలవడానికి ఈ సినిమాకు ఓయ్ అని టైటిల్ పెట్టడానికి గల కారణాన్ని ఈ సందర్భంగా డైరెక్టర్ వెల్లడించారు.
ఈ సినిమాకు టైటిల్ తాను మణిరత్నం సినిమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని పెట్టానని తెలిపారు. మణిరత్నం సినిమాలలో హీరోయిన్లు హీరోని ఓ అంటూ పిలుస్తూ ఉంటారు అందుకే నేను కూడా ఈ సినిమాకు అదే టైటిల్ పెట్టాను. ఇక ఈ సినిమాకు టైటిల్ పెట్టడం వెనుక మరో కారణం ఉందని తెలిపారు.
వన్ ఇయర్…
సంధ్యతో ఉదయ్ ప్రేమకథ 2007 జనవరి 1న అతడి పుట్టినరోజు నాడు స్టార్ట్ అవుతుంది. క్రిస్మస్ కు సంధ్యను ఉదయ్ షిప్ లోకి తీసుకెళ్లడం వరకు కొనసాగి డిసెంబర్ 31తో ముగుస్తుంది.2008 జనవరి ఒకటవ తేదీకి ఆమె చనిపోయి ఉంటుంది. ఇలా వీరి ప్రయాణం ఒక సంవత్సరం పాటు జరుగుతుంది.Oy అంటే వన్ ఇయర్ అని అర్థం అంటూ ఈ సందర్భంగా డైరెక్టర్ ఈ సినిమా టైటిల్ ద్వారానే హీరో హీరోయిన్ల ప్రయాణం ఏడాది పాటు అంటూ చెప్పేశారు. ఇలా ఈ విషయం తెలిసి ఈ సినిమా టైటిల్ లో ఇంత అర్థం దాగి ఉందా ఇన్ని రోజులు అసలు తెలీదు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…