Nagababu: మెగా బ్రదర్ నాగబాబు తాజాగా నటి లావణ్య త్రిపాఠి గురించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి లావణ్య త్రిపాఠి మొదటి సినిమాతోనే తన నటన ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అయిన తర్వాత ఈమె వరసగా సినిమాలలో నటించారు. ఇకపోతే ఇటీవల లావణ్య మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. నటుడు వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకున్నటువంటి ఈమె మెగా ఇంటి కోడలు అయ్యారు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న తర్వాత నటించినటువంటి మిస్ ఫర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది.
ఇకపోతే తాజాగా ఈ సిరీస్ గురించి లావణ్య త్రిపాఠి నటన గురించి నాగబాబు ఇంస్టాగ్రామ్ వేదికగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మై డియర్ లావణ్య నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ అద్భుతంగా ఉంది. వినోదాత్మక అంశాలతో కట్టిపడేసింది. అందరి చూడాల్సిన వెబ్ సిరీస్ అని ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశాడు.
లావణ్య పై పొగడ్తల వర్షం..
ఇలా పరోక్షంగా నాగబాబు ఈ సిరీస్ ప్రమోట్ చేశారు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటించబోతున్నారని విషయం మనకు తెలిసిందే. ఈమెకు నటన పరంగా ఏ విధమైనటువంటి ఆంక్షలు లేవు. ఇక ఈమె పెళ్లి తర్వాత కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యారనే విషయాన్ని ఇటీవల లావణ్య వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…