‘మీలో ఎవరు కోటీశ్వరులు’ అనే ప్రోగ్రాంకు నాగార్జున హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఈ ప్రోగ్రాంకు విపరీతమైన రేటింగ్ వచ్చింది. ఎంతో పాపులారిటీ కూడా తెచ్చుకుంది. ఎంతో మంది అందులో పాల్గొని నగదు బహుమతిని గెలుచుకున్నారు. దీనిలో 15 ప్రశ్నలను అడుగుతారు. ప్రతీ 5 ప్రశ్నలకు ఒకసారి సేఫ్ జోన్ కి వెళ్తారు.
ఇలా 15 ప్రశ్నలు చెప్పిన వాళ్లు రూ. కోటి గెలుచుకుంటారు. అయితే రెండో సీజన్ ఈ ప్రోగ్రాంను మెగస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు. మూడో సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నారు. కానీ ఈ సారి ఆ పేరును ‘ఎవరు మీలో కోటీశ్వరులు’గా మార్చేశాడు. అయితే ఇటీవల ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఒకరు కోటి రూపాయలు గెలుచుకున్నట్లుగా తెలిపారు.
అది ఎవరికి వరించిందో తెలుసా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యక్తిని అదృష్టం వరించింది. సుజాతనగర్ మండలానికి చెందిన బి.రాజారవీంద్ర కోటి రూపాయలు గెలుచుకున్నట్లు తెలుస్తోంది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి బీవీఎస్‌ఎస్ రాజు–శేషుకుమారి దంపతుల కుమారుడు రాజారవీంద్ర డీజీపీ క్యాంపు కార్యాలయంలో ఎస్సైగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు.
ఒకటో ప్రశ్న నుంచి 14 ప్రశ్నల వరకు సమాధానం చెప్పిన తర్వాత రూ.50లక్షలతో అతడు ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ నోటి వెంట రూ.కోటి ప్రశ్న అంటూ మొదటి సారి వచ్చింది. అతడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పినట్లు తెలుస్తోంది. రవీంద్ర మాట్లాడిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…