తెలుగులో రాబోతున్న చిత్రాల్లో అఖండ ఒకటి. నందమూరి బాలకృష్ణ , ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో ఫుల్ హ్యాపీగా ఉన్న చిత్ర యూనిట్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడిగా పని చేశారు. ఫ్రి రిలీజ్ ఈవెంట్లో ఓ సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.53 కోట్ల బిజినెస్ చేసింది.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇంత పెద్ద ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిన మొదటి తెలుగు సినిమాకు అఖండ రికార్టు స్పష్టించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ. 10.5 కోట్లు, సెడెడ్ లో రూ. 10.6 కోట్లు ఉత్తరాంధ్ర లో రూ. 6 కోట్లు, తూర్పుగోదావరి లో రూ. 4 కోట్లు, పశ్చిమ గోదావరి లో రూ. 3.5 కోట్లు, గుంటూరు లో రూ. 5.4 కోట్లు, కృష్ణా లో రూ. 3.7 కోట్లు, నెల్లూరు లో రూ.1.8 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మొత్తం రూ. 45.5 CR, కర్ణాటక +భారతదేశంలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 2.5 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 53 CR, బ్రేక్ ఈవెన్ లో రూ. 54 కోట్లు వసూలు చేసింది.
రిలీజ్ కు ముందే ఇంత పెద్ద బిజినెస్ చేసిన అఖండ డిసెబంర్ 2 న ప్రపంచవ్యాప్తంగా 1400 థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందు ఇంత పెద్ద బిజినెస్ చేసిన అఖండ సినిమా బిజినెస్ కు తగ్గట్లు వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా అఖండ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా పేరు తెచ్చుకుంది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…