ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే డాక్టర్లును సంప్రదించడం జరుగుతుంది. అయితే డాక్టర్లు సూచించిన మందులను వాడటం వల్ల ప్రకృతిలో లభించే సహజమైన ఆయుర్వేదిక మందులు పూర్తిగా మర్చిపోతున్నారు. జలుబు, దగ్గు వంటి చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని చెప్పవచ్చు. పూర్వ కాలం నుంచి ఎన్నో అంతుపట్టని వ్యాధులకు సైతం మన పరిసరాల్లో లభించే మొక్కలలో ఉండే ఔషధాలను ఉపయోగించి వ్యాధిని నయం చేసేవారు. ఇందులో భాగంగానే మనం నిత్యం చూస్తూ ఉండే తిప్పతీగ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
జీర్ణక్రియ సమస్యతో బాధపడేవారు ఈ ఆకుల పొడిలో కొద్దిగా బెల్లం కలుపుకుని ఆ చూర్ణం తీసుకోవడం ద్వారా జీర్ణక్రియలో ఏర్పడే సమస్యలు తొలగిపోతాయి. మధుమేహంతో బాధపడేవారు తిప్పతీగ చూర్ణం ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మన శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. జలుబు, దగ్గు వంటి శ్వాసకోస సంబంధించిన వ్యాధులను తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. దీర్ఘకాలికంగా కీళ్లనొప్పులతో బాధపడేవారు తిప్పతీగ చూర్ణం, అల్లం రసం కలిపి గోరువెచ్చటి నీటిలో తాగడం ద్వారా కీళ్లనొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు. మన పరిసరాలలో కనిపించే తిప్పతీగను ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…