ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే డాక్టర్లును సంప్రదించడం జరుగుతుంది. అయితే డాక్టర్లు సూచించిన మందులను వాడటం వల్ల ప్రకృతిలో లభించే సహజమైన ఆయుర్వేదిక మందులు పూర్తిగా మర్చిపోతున్నారు. జలుబు, దగ్గు వంటి చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని చెప్పవచ్చు. పూర్వ కాలం నుంచి ఎన్నో అంతుపట్టని వ్యాధులకు సైతం మన పరిసరాల్లో లభించే మొక్కలలో ఉండే ఔషధాలను ఉపయోగించి వ్యాధిని నయం చేసేవారు. ఇందులో భాగంగానే మనం నిత్యం చూస్తూ ఉండే తిప్పతీగ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.పూర్వకాలం నుంచి ఆయుర్వేద ఔషధాలను తయారు చేయడంలో తిప్పతీగను ఉపయోగించేవారు.తిప్పతీగల ఆకుల చూర్ణం తీసుకోవడం ద్వారా మన శరీరం వ్యాధులతో పోరాడటానికి అవసరం అయ్యే రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు ఈ తిప్పతీగల ఆకుల చూర్ణం తీసుకోవటం వల్ల జ్వరం, జలుబు వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. అంతేకాకుండా ఈ తిప్పతీగ లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉన్నాయి.

జీర్ణక్రియ సమస్యతో బాధపడేవారు ఈ ఆకుల పొడిలో కొద్దిగా బెల్లం కలుపుకుని ఆ చూర్ణం తీసుకోవడం ద్వారా జీర్ణక్రియలో ఏర్పడే సమస్యలు తొలగిపోతాయి. మధుమేహంతో బాధపడేవారు తిప్పతీగ చూర్ణం ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మన శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. జలుబు, దగ్గు వంటి శ్వాసకోస సంబంధించిన వ్యాధులను తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. దీర్ఘకాలికంగా కీళ్లనొప్పులతో బాధపడేవారు తిప్పతీగ చూర్ణం, అల్లం రసం కలిపి గోరువెచ్చటి నీటిలో తాగడం ద్వారా కీళ్లనొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు. మన పరిసరాలలో కనిపించే తిప్పతీగను ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here