Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. నటుడిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి డైరెక్షన్లో బిజీ కానున్న సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన కూడా వెలబడనుంది.
ఇక మహేష్ బాబు బాల నటుడిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కృష్ణ వారసుడిగా ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించారు. అలాగే పూర్తిస్థాయిలో హీరోగా మారిన తర్వాత వరుస సినిమాలకు కమిట్ అవుతూ హీరోగా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇదిలా ఉండగా మహేష్ బాబు తన కెరీర్ లో ఒక సినిమా కోసం ఏకంగా చీర కట్టి పూలు పెట్టుకొని అమ్మాయిల ముస్తాబయి ఎంతో వయ్యారంగా నడుస్తూ హావ భావాలను పలికించారని తెలుస్తోంది.
ఈ విధంగా మహేష్ బాబు చీర కట్టుకొని పూలు పెట్టుకొని నటించారనే విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఏ సినిమాలో మహేష్ అలా కనిపించారని ఆరా తీస్తున్నారు. అయితే మహేష్ బాబు అమ్మాయి గెటప్ లో నటించిన చిత్రం బాలచంద్రుడు స్వయంగా కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు ఒక చిన్న పాత్రలో నటించారు.
బాలచంద్రుడు..
1991 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా పరవాలేదనిపించుకుంది. ఇక ఈ సినిమాలో రౌడీలను తప్పుదోవ మళ్లించడం కోసం మహేష్ బాబు అమ్మాయి గెటప్ వేసుకున్నారు. ఇక ఈయన పూర్తి స్థాయిలో హీరోగా మారిన తర్వాత ఇలాంటి సాహసాలు చేయలేదు. ఒకవేళ చేసిన ప్రేక్షకులు దానిని యాక్సెప్ట్ చేయలేరు. ఇక మహేష్ అమ్మాయిగా గెటప్ వేశారనే విషయం తెలియడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…