Kamal Hassan: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో సుమారు 1100 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
ఇక ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు కూడా భాగమైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు అమితాబ్, కమల్ హాసన్ వంటి వారు ఈ సినిమాలో భాగమయ్యారు. ఇక ఈ సినిమాలో అమితాబ్ స్క్రీన్ స్పేస్ భారీగా ఉన్నప్పటికీ కమల్ హాసన్ పాత్ర నిడివి మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇందులో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రలో నటించారు.
ఇక ఈ పాత్రలో కమల్ హాసన్ నటన అద్భుతమని చెప్పాలి. మొదటి భాగంలో ఈయన పాత్రకు ప్రాధాన్య లేకపోయినా రెండవ భాగంలో కమల్ హాసన్ పాత్రకు ఎంతో మంచి ప్రాధాన్యత ఉందని డైరెక్టర్ చెప్పకనే చెప్పేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. కమల్ హాసన్ నటించిన సుప్రీం యాస్కిన్ పాత్ర కోసం అశ్విన్ ముందుగా కమల్ హాసన్ కలవగా ఆయన మాత్రం ఎటువంటి సమాధానం చెప్పలేదట.
మోహన్ లాల్..
ఇలా కమల్ హాసన్ నుంచి ఏ విధమైన సమాధానం రాకపోవడంతో అశ్విన్ ఆయన రిజెక్ట్ చేస్తే ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో పడ్డారట దీంతో మలయాల నటుడు మోహన్ లాల్ అయితే ఈ పాత్రకు సెట్ అవుతారని భావించారు. అనూహ్యంగా కమల్ హాసన్ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సుప్రీం యాస్కిన్ పాత్రకు మోహన్ లాల్ దూరమయ్యారు. లేకపోతే ఈ పాత్రలో ఆయనే నటించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…