Connect with us

Featured

Kamal Hassan: కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రను మిస్ చేసుకున్న నటుడు ఎవరో తెలుసా?

Published

on

Kamal Hassan: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో సుమారు 1100 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

Advertisement

ఇక ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు కూడా భాగమైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు అమితాబ్, కమల్ హాసన్ వంటి వారు ఈ సినిమాలో భాగమయ్యారు. ఇక ఈ సినిమాలో అమితాబ్ స్క్రీన్ స్పేస్ భారీగా ఉన్నప్పటికీ కమల్ హాసన్ పాత్ర నిడివి మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇందులో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రలో నటించారు.

ఇక ఈ పాత్రలో కమల్ హాసన్ నటన అద్భుతమని చెప్పాలి. మొదటి భాగంలో ఈయన పాత్రకు ప్రాధాన్య లేకపోయినా రెండవ భాగంలో కమల్ హాసన్ పాత్రకు ఎంతో మంచి ప్రాధాన్యత ఉందని డైరెక్టర్ చెప్పకనే చెప్పేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. కమల్ హాసన్ నటించిన సుప్రీం యాస్కిన్ పాత్ర కోసం అశ్విన్ ముందుగా కమల్ హాసన్ కలవగా ఆయన మాత్రం ఎటువంటి సమాధానం చెప్పలేదట.

మోహన్ లాల్..
ఇలా కమల్ హాసన్ నుంచి ఏ విధమైన సమాధానం రాకపోవడంతో అశ్విన్ ఆయన రిజెక్ట్ చేస్తే ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో పడ్డారట దీంతో మలయాల నటుడు మోహన్ లాల్ అయితే ఈ పాత్రకు సెట్ అవుతారని భావించారు. అనూహ్యంగా కమల్ హాసన్ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సుప్రీం యాస్కిన్ పాత్రకు మోహన్ లాల్ దూరమయ్యారు. లేకపోతే ఈ పాత్రలో ఆయనే నటించారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishnu Priya: హౌస్ లో విష్ణుప్రియ బట్టలు మార్చుకోవడం చూసింది అతనేనా.. ఎవరంటే?

Published

on

Vishnu Priya: బిగ్ బాస్ హౌస్ అంటేనే పెద్ద ఎత్తున గొడవలు వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఈ సీజన్ లో కూడా కంటెస్టెంట్ల మధ్య ఇలాంటి గొడవలే జరుగుతున్నాయి. ప్రస్తుతం హౌస్ లో కొనసాగుతున్న విష్ణు ప్రియ సోనియా మధ్య భారీ స్థాయిలో వివాదం జరుగుతుంది. సోనియా విష్ణు ప్రియ ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది.

Advertisement

నీకు ఫ్యామిలీ లేదు నాకు ఫ్యామిలీ ఉంది నీలాగా బట్టలు వేసుకుని తిరగలేను అంటూ ఇస్టానుసారంగా మాట్లాడటంతో సోనియా బాగా నెగిటివ్ అవుతుంది. నిజానికి విష్ణు ప్రియ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బిగ్ బాస్ హౌస్లో చేయలేదు. అంతేకాకుండా సోనియా ఫేమస్ అవడం కోసం విష్ణు ప్రియను టార్గెట్ చేస్తూ వస్తున్నారు.

ఇక విష్ణు ప్రియ గురించి నిఖిల్, అభయ్ దగ్గర మాట్లాడుతూ.. విష్ణుప్రియ రూమ్లో బట్టలు మార్చుకుంటూ ఉంటే ఆదిత్య ఆ రూంలోకి వెళ్లారు. అయన వణుకుతూ బయటకు వచ్చారు.. ఆమె జస్ట్ బ్లౌజ్ లో ఉంది మళ్లీ వచ్చి ఆదిత్య గారు ఆన్ కంఫర్ట్బుల్ గా ఫీల్ చేశాను సారీ సారీ అని చెప్తుంది.

ఆదిత్య ఓం..
నిజానికి ఆదిత్య ఓం అంత అన్ కంఫర్ట్బుల్ ఫీల్ అయ్యారని అతనికి కూడా తెలియకపోవడం గమనించాల్సిన విషయం. సోనియా హౌస్ లో ఫేమస్ అవడం కోసం కేవలం విష్ణు ప్రియ ను టార్గెట్ చేస్తూ రావడంతో ఈమె పట్ల అభిమానులు కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందు తనని హౌస్ నుంచి బయటకు పంపించేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఘటనపై ఈ వారం నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Janhvi Kapoor: దేవర ప్రమోషన్స్ కోసం జాన్వీ కట్టిన ఈ చీర ఖరీదు తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి జాన్వీ కపూర్. ఇదివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తూ ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Advertisement

ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ముంబైలో ఎంతో ఘనంగా లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ పాత్రలో నటించారు.

ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా జాన్వీ కపూర్ గులాబీ రంగు చీర కట్టుకొని సందడి చేశారు. అయితే ఈమె చీర అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈమె కట్టిన ఈ చీర ఖరీదు ఎంత ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక ఈ వేడుకలో జాన్వీ కపూర్ నచికేత్ బ్రావే డిజైన్ చీరను కట్టారు.

దేవర…
ఈ చీర ఖ‌రీదు అక్ష‌రాల రూ. 1,24,850. అలాగే పింక్ శారీకి పెయిర్ అప్ గా చెవుల‌కు జాన్వీ పెట్టుకున్న ఇయ‌ర్ రింగ్స్ ధ‌ర రూ. 13 ల‌క్ష‌లని తెలిసిన అభిమానులు ఒకసారిగా షాక్ అవుతున్నారు. ఇలా సెలబ్రిటీలు బ్రాండెడ్ దుస్తులను ధరించడం సర్వసాధారణం. ఇక దేవర సినిమా ద్వారా మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈమె ఈ సినిమా ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Star Anchor: నాట్యం చేస్తున్న ఈ నాట్య మయూరిని గుర్తుపట్టారా… ఇప్పుడు టాప్ యాంకర్?

Published

on

Star Anchor: సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా వారి చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిమానులు ఆ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు. తాజాగా ఒక యాంకరమ్మ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

నాట్యం మయూరిలా ఎంతో చక్కగా నాట్యం చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె అభిమానులు ఈ ఫోటోను మరింత వైరల్ చేస్తున్నారు. మరి ఈ ఫోటోలో ఉన్న ఈమె ఎవరో తెలుసా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్. ఎస్ మీరు గెస్ చేసినది కరెక్టే ఇక్కడ ఉన్నది యాంకర్ సుమ.

సుమా కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ తన తల్లి తండ్రుల ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చారు. ఇక హైదరాబాదులో ఉంటూనే ఈమె ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. మొదట దేవదాస్ కనకాల దర్శకత్వంలో వచ్చిన మేఘమాల సీరియల్ తో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ సమయంలోనే రాజీవ్ కనకాలతో పరిచయం ఏర్పడటం ఆ పరిచయము కాస్త ప్రేమగా మారడం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది.

యాంకర్ సుమ..
ఇలా పెళ్లి తర్వాత కూడా సుమ ఇండస్ట్రీలో పలు సినిమాలు అలాగే సీరియల్స్ లో నటించారు. అనంతరం యాంకర్ గా కూడా మారి ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా ఎంతో బిజీగా కొనసాగుతున్నారు. ఏదైనా ఒక సినిమా వేడుక జరుగుతుంది అంటే కచ్చితంగా ఆ కార్యక్రమంలో సుమ ఉండాల్సిందే. ఆ సినిమా టీజర్ లాంచ్ నుంచి మొదలుకొని సక్సెస్ మీట్ వరకు సుమ పాత్ర ఎంతగానో ఉంటుందని చెప్పాలి.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!