రేణు దేశాయ్.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఈమె పవన్ కళ్యాణ్ కు మాజీ భార్య. రేణుదేశాయ్ సినిమాల్లోకి రాకముందు ఓ మోడల్ గా పని చేసారు. ఆవిడ మోడల్ రంగం నుంచి డైరెక్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ సరసన బద్రి సినిమాలో నటించింది. ఇక ఆ సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల మధ్య ప్రేమ చిగురించింది.
తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టారు. అందులో కుమారుడు అకిరా.. కూతురు ఆద్య. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మనస్పర్థల కారణంగా వారిద్దరూ విడిపోయే వరకు కూడా పవన్ కళ్యాణ్ కి రేణు దేశాయ్ ఫ్యాషన్ డిజైనర్ గా ఉంటూ అన్ని ఆవిడే చూసుకునేది. ఇక పిల్లలకు సంబంధించి ఏ విషయం అయినా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటోంది.
ఇటీవల అకీరాకు సంబంధించి కర్రసాము వీడియో పోస్టు చేయగా అది పెద్ద వైరల్ అయింది. మళ్లీ తాజాగా ఆద్యకు సంబంధించి ఓ వీడియోను పోస్టు చేశారు. ఆద్య గిటార్ వాయిస్తూ ఉన్న వీడియోను చూసిన మెగా అభిమానుల సంతోషానికి హద్దులు లేకుండా పోతున్నాయి. ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. ఇక రేణుదేశాయ్ ప్రస్తుతం పూణెలో స్థిరపడగా.. గత కొన్ని రోజుల నుంచి ఆమెకు హైదరాబాద్ లో ఉంటుంన్నారట.ఆమెకు హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉంది. అక్కడే ఆమె నివాసం ఉంటున్నారు.
ఇక ఆమె ఆస్తుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ తో విడిపోయిన తర్వాత ఆమెకు భరణం కింద భారీగా డబ్బులు ఇచ్చారని వార్తలు వచ్చాయి. దానికి ఆమె సమాధానం చెబుతూ.. తనకు ఏం ఇవ్వలేదని.. అది ఫేక్ అంటూ కొట్టి పారేశారు. అయితే ఆమెకు జూబ్లీ హిల్స్‌లో ఖరీదైన ఇల్లు.. మూడు కార్లు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. పూణేలో కూడా స్థిరాస్థులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇవన్నీ నిరాధారమైనవి. మొత్తానికి ఆమె వద్ద రూ.40 కోట్ల వరకు ఆస్తి ఉంటుందనేది టాక్ వినిపిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…