ఊర్వశి రౌతేలా తన అందం, అభినయంతో హిందీ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. 2013లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అంతక ముందు మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది.
ఆమె వర్జిన్ భాను ప్రియ, సనమ్ రే, పాగల్ పంతి, హేట్ స్టోరీ 4, గ్రేట్ గ్రాండ్ మస్తీ వంటి చిత్రాల్లో నటించింది. ఈమె నటించిన మరో సినిమా బ్లాక్ రోజ్. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈమెకు సంబంధించి మరో విషయం ఏంటంటే.. 2015 సంవత్సరంలో ఉర్వశి రౌతేలా భారత్ తరఫున మిస్ యూనివర్స్ పోటీల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
ఇక తాజాగా 2021లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఆమె కూడా పాల్గొంది. అందాల పోటీల్లో కాదులేండి.. ఆమె న్యాయ నిర్ణేతగా ‘మిస్ యూనివర్స్-2021’ వ్వవహరించారు. ఈ పోటీలు ఇజ్రాయిల్ లో జరిగిన విషయం తెలిసిందే. దీని ద్వారానే అమె ఓ గుర్తింపు సాధించారు. అత్యంత చిన్న వయస్సులోనే ఈ గ్రాండ్ ఈవెంట్లో భారతదేశం తరఫున జడ్జి చేసిన మొదటి వ్యక్తిగ నిలిచారు.
ఇక ఆమె ఈ షో ముగిసిన తర్వాత నేరుగా ముంబైకి చేరుకున్నారు. ఇక అక్కడ ఉన్న కెమెరా కళ్లు ఆమెపై క్లిక్ మనిపించాయి. గులాబీ రంగు దుస్తులు ధరించి కనిపించిన ఆమె ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా మరో విషయం ఏంటంటే.. ఆమె ధరించిన ఆ గులాబీ డ్రెస్ విలువ ఎంతో తెలుసా.. దాదాపు రూ.5లక్షలు అంట. ఈ డ్రెస్ పై వజ్రాలు కూడా ఉన్నాయి. ఇక ఆమె ధరించిన చెవి రింగులో కూడా వజ్రాలతో ఉండటం విశేషం. దీనికి సంబంధించి వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…