రాజమౌళికి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు మధ్య దూరం పెరగడానికి కారణం అదేనా..?

ఒక్క తెలుగులోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి. అతడిని తెలిసిన వాళ్లు చాలామంది జక్కన్న అని పిలుస్తుంటారు. కారణం ఏంటంటే.. అతడు ఏ సినిమాకైతే దర్శకత్వం వహిస్తుంటాడో .. ఆ సినిమాను శిల్పంలాగా చెక్కి.. ప్రేక్షకుల ముందు ఉంచుతాడు. అందుకనే చాలామంది జక్కన్న అని పిలుస్తుంటారు.

ఇలా అతడు ఏ సినిమా పట్టినా మినిమం హిట్ గ్యారెంటీ అనే నమ్మకాన్ని కలిగించాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎంతో మంది హీరోలు.. హరోయిన్లు స్టార్లుగా ఎదిగారు. అంతే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసిన వాళ్లు కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక సీనియర్ హీరో.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి చెప్పాలంటే.. కొన్ని వందల సినిమాలు చేసి.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అటు విలన్ గా.. ఇటు హీరోగా ఏ పాత్ర ఇచ్చినా ఇమిడిపోయి నటించే వ్కకతిగా మోహన్ బాబుకు మంచి పేరు ఉంది. అంతే కాదు.. ప్రస్తుతం తన వారసులను కూడా రంగంలోకి దింపి.. సినీ పరిశ్రమను ఏలుతున్నాడనే చెప్పాలి. ఇటీవల అతడి పెద్ద కుమారుడు మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే మోహన్ బాబుకు.. రాజమౌళికి మధ్య స్నేహభావం చాలావరకు ఉంది. ఎందుకంటే.. యమదొంగ సినిమాలో యముడి క్యారెక్టర్ చేసినప్పుడు రాజమౌళితో అతడు ఇంట్రాక్ట్ అయ్యాడు.

అయితే చత్రపతి, సింహాద్రి, యమదొంగ వంటి సినిమాలు తీస్తున్న సమయంలో మోహన్ బాబు.. రాజమౌళిని ఇలా అడిగాడట.. మంచు విష్ణుతో ఒక సినిమా తీయాలని అడగండంతో.. మంచి కథ దొరికితే కచ్చితంగా తీస్తానని హామీ ఇచ్చాడట. దాంతో పాటే.. ఏ కథ పడితే ఆ కథకు తాను సినిమాలు చేయలేను అని అంటే.. మోహన్ బాబు కాస్త ఫీల్ అయ్యాడని.. అందుకే రాజమౌళికి.. మోహన్ బాబుకు మధ్య దూరం పెరిగిందని సమాచారం.