కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటుగా ఏర్పడిందని చెప్పవచ్చు. నేడు ఉదయం తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన పునీత్ మృతి చెందడంతో పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పునీత్ మరణం పై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ తన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
ఈ క్రమంలోనే కన్నడ నటుడు పునీత్, జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే విషయం గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.పునీత్ రాజ్ కుమార్, ఎన్టీఆర్ కు మధ్య మంచి స్నేహ బంధం ఉందని చెప్పవచ్చు. పునీత్ నటించిన చక్రవ్యూహ అనే సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెలయా గెలాయా అనే పాటను పాడారు.ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని చెప్పవచ్చు.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఏ విధమైనటువంటి మాస్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కన్నడ ఇండస్ట్రీ లో కూడా పునీత్ అలాంటి మాస్ యాక్షన్ చిత్రాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారని చెప్పవచ్చు.ఎన్టీఆర్ తన కామెడీ ఎమోషనల్ సన్నివేశాలను ఎంతో అద్భుతంగా పండిస్తూ తన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు.
ఎన్టీఆర్ తరహాలోనే పునీత్ కూడా అద్భుతమైన నటన శైలితో విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఈ అనుబంధంతోనే పునీత్ కోసం ఎన్టీఆర్ చక్రవ్యూహ సినిమాలో పాటలు కూడా పాడారు. ఇలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహ బంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఉన్నఫలంగా తన స్నేహితుడు గుండెపోటుతో మరణించాడనే వార్త తెలియగానే ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్పందిస్తూ ఆత్మీయ మిత్రుడు కన్నుమూయడంతో తట్టుకోలేకపోతున్నానని ఈ బాధ నుంచి ఆ కుటుంబం తొందరగా బయటపడాలని, పునీత్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్న అంటూ ఎన్టీఆర్ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…