Featured

KGF2 : కేజిఎఫ్ కోసం యశ్, ప్రశాంత్ నీల్, రవీనా తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

KGF 2: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం కేజిఎఫ్ చాప్టర్ 2 గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఎంతో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.సినిమా విడుదలై 10 రోజులు పూర్తిచేసుకోగా ఇప్పటికే 850 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. త్వరలోనే ఈ సినిమా వేయి కోట్లను క్రాస్ చేస్తుందని చెప్పవచ్చు.

KGF2 : కేజిఎఫ్ కోసం యశ్, ప్రశాంత్ నీల్, రవీనా తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే ఈ సినిమాలో నటించిన యశ్, రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, శ్రీనిధి శెట్టి వంటి పలువురు కీలక పాత్రలో నటించారు. ఇకపోతే భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో నటించిన నటీ నటులు ఏ మేరకు పారితోషకం తీసుకున్నారనే విషయం గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

KGF2 : కేజిఎఫ్ కోసం యశ్, ప్రశాంత్ నీల్, రవీనా తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోగా నటించిన యశ్ ఈ సినిమా కోసం 30 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా రవీనాటాండన్ భారత ప్రధాని రమికా సేన్ పాత్రలో నటించారు. ఈ పాత్రలో నటించినందుకు గాను ఈమె 1.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఈ సినిమాలో విలన్ అధీర పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ నెగటివ్ రోల్ కోసం రూ.9 కోట్లు రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.

విజయేంద్ర ఇంగలగి పాత్రలో ప్రకాష్ రాజ్..

రీనా దేశాయ్ పాత్రలో మోడల్ మరియు నటి శ్రీనిధి శెట్టి ఎంతో అద్భుతంగా నటించారు. ఈ పాత్రలో నటించినందుకు ఈమె మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇక విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో విజయేంద్ర ఇంగలగి పాత్రను పోషించాడు. దీని కోసం అతను రూ. 80-82 లక్షలు తీసుకున్నారు. ఇక ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు వహించిన ప్రశాంత్ నీల్ 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago