Kajal Agarwal : మెగాస్టార్ చిరు, ఆయన తనయుడితో నటిస్తున్న తొలి చిత్రం ఆచార్య. కొరటాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో చిరుకి జోడిగా కాజల్ నటిస్తోందని ప్రకటించారు. రామ్ చరణ్ కి జోడిగా పూజ హెగ్డే నటించింది. కానీ ఇటీవల విడుదలైన ట్రైలర్ లో కాజల్ ను ఒక్కసారిగా కూడా చూపించక పోవడంతో ఆమె అభిమానులు నిరాశ చెందారు. అయితే అసలు కాజల్ సినిమాలో ఉందొ లేదో అన్న అనుమానాలు మొదలయ్యాయి. 2.33 నిమిషాల ట్రైలర్‍లో కాజల్ పాత్ర గురించి కాస్త కూడా చూపించలేదు.
కరోనా కు ముందు విడుదల చేసిన లాహే లాహే పాటలో కనిపించిన కాజల్ మళ్ళీ ఇటీవల వచ్చిన ట్రైలర్ లో ఇక కాజల్ ఊసే లేదు. దీనితో రకరకాల కామెంట్స్ వినిపించాయి. కాజల్ కొన్ని సన్నివేశాల్లో నటించిన తరువాత కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడటం, ఆ తర్వాత కాజల్ ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల సినిమాకు సంబంధించిన తన భాగం పూర్తి చేయలేదు పైగా వచ్చి షూటింగ్ పూర్తి చేయమని అడిగిన చిత్రం యూనిట్ కి సహకరించలేదంటూ పుకార్లు వినిపించాయి . ఇక సినిమాలో కూడా తన సన్నివేశాలను తొలిగించారనే వార్తలు వినిపించాయి .
ఇక ఈ విషయంపై కొరటాల క్లారిటీ ఇచ్చారు. నక్సలిజం నేపథ్యంలో సాగే హీరోకు లవ్ సన్నివేశాలు పెట్టడం బాగా ఉండదని అనిపించి కొన్ని సన్నివేశాల కోసం పెద్ద హీరోయిన్ కాజల్ తో చిత్రీకరించడం బాగోదని దీంతో సినిమాలో ఆమె పాత్ర వద్దనుకున్నామని ఈ విషయాన్నే కాజల్ కు వివరించగా ఆమె అర్థం చేసుకున్నారని కొరటాల చెప్పుకొచ్చారు. ఇక ఆచార్య సినిమా ఈ నెల 29న విడుదల కాబోతోంది.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…