హీరోలకు ఏ మాత్రం తీసిపోని.. విలన్ ల పారితోషికం.. ఆ ప్రతినాయకుల జావితా ఇదే..!

సినిమాలో హీరోలకు ఎంత డిమాండ్ ఉంటుందో.. ప్రతినాయకుడికి కూడా అంతే డిమాండ్ ఉంటుంది. హీరోకు తగ్గట్లు ప్రతి నాయకుడు లేకపోతే..కథ ఎంత మంచిగ ఉన్నా.. సినిమాను ప్రేక్షకులు ఆదరించలేరు. అందుకే హీరోలకు ఎంత పారితోషికం ఇస్తున్నారో.. ప్రతి నాయకుడికి కూడా అంతే ఇస్తున్నారు. ఇలా తెలుగులో నటిస్తున్న పవర్ ఫుల్ ప్రతినాయకులు ఎవరు..వాళ్లు ఎంతో తీసుకుంటుంన్నారో తెలుసుకుందాం..

అందులో ముఖ్యంగా గుర్తుకు వచ్చే పేరు జగపతిబాబు. అతడు హీరోగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో.. అంత కంటే ఎక్కువ పేరు విలన్ గా తెచ్చుకుంటున్నాడు. విలన్ గా అతడు ఎంతో బిజీ అయిపోయాడు. అతడు ఒక్కో సినిమాకు రూ. 1 నుంచి రూ. 1.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఇక తాజాగా అఖండలో ప్రతినాయకుడిగా నటించిన శ్రీకాంత్ .. అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు. విలన్ గా నటించిన శ్రీకాంత్ కు దీనిలో రూ.కోటి ఇచ్చారట.

ఇక విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ విషయానికి వస్తే.. అతడు విలన్ గానే కాకుండా ఎన్నో క్యారెక్టర్లను పండిస్తాడు. అందులో ఒదిగా..జీవించేస్తాడు. అతడికి ఒక్క రోజుకు రూ. 10 లక్షలు ఇస్తారు. అతడు కూడా కొన్ని సినిమాలకు రూ.1.5కోట్లు తీసుకున్నాడు. ఇక రియల్ హీరో సోనూసూద్ కు కూడా విలన్ గా మంచి పేరు ఉంది. ఇతడు బాలీవుడ్ లో కూడా నటిస్తాడు కాబట్టి.. ఇతడికి కాస్త డిమాండ్ ఎక్కువనే చెప్పాలి. సోనూసూద్ ఒక్క సినిమాకు రూ. 3 కోట్లు పారితోషికం తీసుకుంటాడు.

ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాలో విలన్ గా నటించిన సంపత్ రాజ్ కు రూ. 40 లక్షలు.. డైలాగ్ కింగ్ సాయి కుమార్ విలన్ అయినా.. సపోర్టింగ్ రోల్ అయినా సినిమాకు రూ.50 లక్షలు తీసుకుంటాడు. ఇక కన్నడ సూపర్ స్టార్..ఈగ విలన్ కు కూడా బారీగానే పారితోషికం ఉంది. అతడు ఒక్క సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటాడు. ఆది పినిశెట్టికి రూ. కోటి.. రవికిషన్ కు రూ.40 లక్షలు.. ఈ తమిళ విలన్ హరీష్ ఉత్తమన్ కు రూ. 30 లక్షలు, వివేక్ ఒబేరాయ్ రూ. 3 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.