Devi sri Prasad: సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకులకు కూడా ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. ఈయన ఓ సినిమాకు సంగీతం అందిస్తున్నారు అంటే ఆ సినిమా పక్కా హిట్ అనే సంగతి మనకు తెలిసిందే.
ఇలా ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలలో దూసుకుపోతున్న దేవిశ్రీప్రసాద్ స్పీడ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. కోలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా సక్సెస్ అయిన అనిరుద్ కారణంగా ఈయనకు కాస్త సినిమా అవకాశాలు తగ్గాయి. త్వరలోనే దేవిశ్రీప్రసాద్ భారీ బడ్జెట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి కూడా సిద్ధమవుతున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల ఈయన తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే దేవిశ్రీప్రసాద్ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేవిశ్రీప్రసాద్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతూ ఒక్కో సినిమాకు సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
కోట్లలో ఆస్తులు..
ఇలా ఈయన సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇప్పటివరకు సుమారు 50 కోట్లకు పైగా ఆస్తులను సంపాదించారని సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరోలు కూడా ఈయన ముందు వేస్ట్ అని ఆ స్థాయిలో ఆస్తులను కూడా పెట్టారని తెలుస్తుంది. ఇక ఈయన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా సక్సెస్ అయినప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉండిపోయారు. గతంలో ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చినప్పటికీ వీరిద్దరూ మాత్రం పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే మిగిలిపోయారని చెప్పాలి
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…