Ram pothineni: ఇప్పటివరకు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరోలు పెళ్లిళ్లు చేసుకొని ఓ ఇంటి వాళ్ళు అయ్యారు. ఇటీవల పెళ్లి చేసుకున్న వారందరూ కూడా తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఇలా ఒకేసారి ఇండస్ట్రీలోకి వచ్చిన వారందరూ చాలామంది పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ ఇంకొంత మంది మాత్రం అలాగే బ్యాచిలర్స్ గానే జీవితం గడిపేస్తున్నారు.
ఇలా ఇండస్ట్రీలో మోస్ట్ బ్యాచిలర్ లిస్ట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఉన్నారని చెప్పాలి. ఈయన దేవదాసు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రామ్ అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో ఈయన మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ సినిమాలను అందుకోలేక పోయారు.
ఇలా ఈయన కెరియర్ పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోయిన రామ్ ఇంకా పెళ్లి చేసుకోకుండా అలానే ఉన్నారు. ఈయన పెళ్లి వార్త కోసం అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో తన పెళ్లి జరగబోతుంది అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి కానీ ఆయన పెళ్లి గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు.
సెప్టెంబర్ లో నిశ్చితార్థం…
ఇకపోతే తాజాగా ఈయన పెళ్లికి సంబంధించి మరొక వార్త వైరల్ అవుతుంది. ఈయన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. కుటుంబ సభ్యుల చూసిన అమ్మాయితోనే రామ్ వివాహం జరగబోతుందని సమాచారం. ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాకుండా ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో రామ్ వివాహం జరగనుందని సమాచారం. ఇలా హైదరాబాద్ కి చెందిన ఆ యువతీతో ఈయన ఏడడుగులు నడవబోతున్నారని సెప్టెంబర్ లో నిశ్చితార్థం ఈ ఏడాది చివరిలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…