మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషులు మారుతున్నారు, అలాగే మనసులో జీవనశైలి కూడా మారుతోంది. అయితే ఒకప్పుడు మనుషులు బాగా కష్టపడి పని చేసేవారు. అలాగే వాడికి ఆరోగ్యాలు కూడా అదే విధంగా ఉండేవి. కానీ కాలానికి అనుగుణంగా ప్రజలు మారిపోయారు. ఈ తరం ప్రజలు అయితే ఎక్కువగా పని చేయలేరు. ఇక మనుషుల జీవనశైలిలో మార్పులు వచ్చాయి అనడానికి అసలు ఉదాహరణ భోజనం చేయడం.
అప్పట్లో కింద కూర్చొని ఇంటి సభ్యులు అందరూ కలసి చక్కగా భోజనం చేసేవారు. కానీ ప్రస్తుతం మాత్రం కింద కాకుండా డైనింగ్ టేబుల్స్ కి అలవాటు పడిపోయారు.ప్రస్తుతం ఇంట్లో చూసినా కూడా ఈ డైనింగ్ టేబుల్ కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇలా డైనింగ్ టేబుల్స్ పై కూర్చొని తినడం కూడా ప్రమాదకరం అని అంటున్నారు శాస్త్రవేత్తలు. మరి డైనింగ్ టేబుల్ పై కూర్చుని తినడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే కూర్చుని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం.
నేలపై కూర్చొని ఆహారం తినడం వల్ల ఆహారం తీసుకునే సమయంలో ప్లేట్ కింద ఉంటుంది కాబట్టి ప్రతీసారి ముందుకు, వెనక్కి కదలాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల పొట్టలో ఉండే కండరాలు క్రీయాశీలకంగా మారుతాయి.అప్పుడుతీసుకున్న ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.అలాగే కింద కూర్చొని తినడం వల్ల వెన్నపూస నిటారుగా ఉంటుంది. దీనితో మెదడుకు సమాచారం సులభంగా చేరుతుంది. దీంతో పొట్ట నిండిందన్న విషయాన్ని మెదడు త్వరగా గుర్తించి ఇక చాలు అని చెప్పేసింది. ఇది బరువు తగ్గడానికి కూడా దోహద పడుతుంది.
ఈ మధ్య కాలంలో నేలపై పద్మాసనంలో కూర్చోవడం పూర్తిగా తగ్గిపోయింది. చెయిర్లు, సోఫాల వాడకం పెరగడంతో అందరూ పైనే కూర్చుంటున్నారు. కానీ నేలపై కూర్చొవడం వల్ల కండరాలు, కీళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే నడుము నొప్పి, ఇతర నొప్పులు రాకుండా చెక్ పెట్టవచ్చు. నేలపై పద్మాసనంలో కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అదే చెయిర్‌లపై కూర్చుంటే గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. కాబట్టి తినే సమయంలోనైనా కింద కూర్చొని తినడం వల్ల పలు రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…