Movie News

వియ్యంకులుగా మారాలనుకున్న.. అక్కినేని, నందమూరి కుటుంబాలు.. కానీ అలా జరగడంతో?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి నందమూరి కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. అప్పట్లో నాగేశ్వరరావు ఎన్టీఆర్ ఎన్నో సినిమాలలో కలిసి నటించడం వల్ల ఈ రెండు కుటుంబాల మధ్య ఎంతో సఖ్యత ఏర్పడింది.

ఇలా నాగేశ్వరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగార్జున,నందమూరి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బాలకృష్ణ మధ్య కూడా ఇదే స్నేహ భావం ఏర్పడింది. అయితే ఇలా ఒకరికొకరు ఎంతో సన్నిహితంగా ఉన్న ఈ రెండు కుటుంబాలు ఒకానొక సమయంలో వియ్యంకులుగా మారాలని భావించారట. ఈ విషయాన్ని అప్పట్లో నాగేశ్వరరావు ఓ సందర్భంలో బయటపెట్టారు.

నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య కెరీర్ మొదట్లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే బాలకృష్ణ రెండవ కూతురునీ ఇచ్చి నాగచైతన్యకు వివాహం చేయాలని భావించారట. అప్పట్లో ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయని సమాచారం.

అయితే ఆ సమయంలో నాగచైతన్య ఏం మాయ చేసావే సినిమా ద్వారా సమంతతో ప్రేమలో పడటం వల్ల ఈ విషయం తెలిసిన ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లి ప్రస్తావనను అంతటితో ఆపివేశారనీ సమాచారం. ఇలా వియ్యంకులుగా మారాల్సిన ఈ స్టార్ హీరోలు వారి పెళ్లి జరగకపోవడంతో ఇప్పటికీ ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా ఉండిపోయారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

46 minutes ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

52 minutes ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

1 hour ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

1 hour ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

1 hour ago

ఆయన నమ్మకమే నా కెరీర్ మలుపు.. అజయ్ ఘోష్ ఎమోషనల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…

1 hour ago