తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనాత్మక డైరెక్టర్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎక్కడుంటే వివాదాలు అక్కడ ఉంటాయి.కేవలం సినిమా అని మాత్రమే కాకుండా సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేస్తూ పలు వివాదాలకు కారణమవుతాడు. ఇదిలా ఉండగా తాజాగా రామ్ గోపాల్ వర్మ మా ఎన్నికలపై స్పందించాడు.
గత కొద్ది రోజుల క్రితం జరిగిన మా ఎన్నికలు ఎంత రసవత్తరంగా కొనసాగాయో అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికలలో నువ్వా నేనా అంటూ సాధారణ ఎన్నికలను తలపిస్తూ ఎన్నో వివాదాల మధ్య ముగిశాయి.ఈ క్రమంలోనే మా ఎన్నికలలో భాగంగా మా అధ్యక్షత పదవిని మంచు విష్ణు దక్కించుకున్నారు.ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ మా ఎన్నికల పై స్పందిస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ..మా మొత్తం జోకర్ లతో నిండిపోయింది అంటూ ట్వీట్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ కి మంచు మనోజ్ స్పందిస్తూ మీరు రింగ్ మాస్టర్ అంటూ కామెంట్ చేశారు. అయితే మనోజ్ చేసిన ఈట్వీట్ పై తిరిగి రామ్ గోపాల్ వర్మ స్పందించారు.
ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ స్పందిస్తూ సర్ నేను రింగ్ మాస్టర్ ని కాదు నేను కేవలం వినోదాన్ని పంచే కోతిని మాత్రమే అంటూ సమాధానం చెప్పాడు. ఈ క్రమంలోనే మనోజ్ స్పందిస్తూ.. సర్ మనందరం ఓకే సర్కస్ కు చెందిన వాళ్లం అంటూ సమాధానం చెప్పుకొచ్చారు. ఇలా వీరి మధ్య ఎంతో ఆశక్తికరమైన సంభాషణ నడిచిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తలనొప్పి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే సాధారణ సమస్య. పని ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన, ఆకలి,…
ఫుడ్ కంపెనీలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా.. ‘హెల్తీ’, ‘ఆర్గానిక్’ పేర్లతో వినియోగదారులను మభ్యపెడుతున్నారా? ఈ రోజుల్లో మార్కెట్‌లో అడుగుపెడితే ప్రతి రెండో…
తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువు గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మనం వింటూ ఉంటాం. అయితే గర్భంలో ఉన్న బిడ్డ…
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి తన రాజకీయ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. దేశ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం కోసం ప్రజలు అనుసరిస్తున్న పద్ధతుల్లో ఒకటి రాత్రి భోజనం మానేయడం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న…
పెళ్లి అనేది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. ముఖ్యంగా మహిళలకు పెళ్లి తర్వాత జీవితం పూర్తిగా కొత్త…