తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, బుల్లితెర సీరియల్స్ లో నటిగా నటిస్తూ ఎంతో మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటి ప్రియా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ రియాలిటీ షో లోకి అడుగుపెట్టింది. ఇలా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రియ హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఏదో ఒక వివాదం ద్వారా హైలెట్ అవుతూనే ఉంది. గత కొన్ని వారాల క్రితం కంటెస్టెంట్ లహరి రవికి మధ్య ఎఫైర్ ఉందంటూ నానా హంగామా సృష్టించింది.
తను పెళ్లైన వారితోనే ఎక్కువగా ఉంటుందని ఏకంగా రవికి ముద్దులు పెడుతుందని ప్రియా చేసిన ఆరోపణలపై రవి లహరి తీవ్రస్థాయిలో ఖండించారు. ఇక పోతే బంగారు కోడిపెట్ట టాస్క్ లో భాగంగా ప్రియా సన్నీ విషయంలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మాటిమాటికి తనని చెంప పగులుతుంది అంటూ హెచ్చరించడంతో ప్రియాకు పిచ్చి పట్టినట్టు ఉందని నెటిజన్లు ఈమెను దారుణంగా ట్రోల్ చేశారు.
ఇదిలా ఉండగా గతవారం నామినేషన్ లో ఉన్న ప్రియా చివరికి ఎలిమినేట్ అయింది. ఇలా హౌస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ప్రియా మరో వివాదానికి కారణం అయ్యింది. ఈ క్రమంలోనే ప్రియా మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో అసమంజసమైన కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, హౌస్ లో ఉన్న కొందరు కంటెస్టెంట్ లు బయట వ్యక్తుల సపోర్టుతో ఎంతో సరదాగా ఆటను ఆడుతున్నారని కేవలం నిజాయితీగా ఆటాడే వారు మాత్రమే ఎలిమినేట్ అవుతున్నారు అని పేర్కొన్నారు.
ఇలా ఈమె బిగ్ బాస్ నిర్వాహకులకు పై చేసిన ఆరోపణలు ఎక్కడ అధికారకంగా లేకపోయినప్పటికీ ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఏడు వారాల పాటు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన ఈమెకు సుమారు పది లక్షలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…