మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు మహిళల భద్రతను వారి సాధికారతను పెంచడం కోసం ఒక కమిటీని వేసిన సంగతి మనకు తెలిసిందే. నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన మంచు విష్ణు మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలోనే మహిళల కోసం విమెన్ ఎంపవర్‌మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్(WEGC)ను ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఈ క్రమంలోనే విష్ణు మాట్లాడుతూ మహిళల పట్ల ఎంతో దారుణమైన వీడియోలు, థంబ్‌నైల్స్ పెడుతూ వారిని అవమాన పరుస్తున్నారని,ఇలా మహిళల పట్ల అవమానకరంగా ప్రవర్తించే యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోబోతున్నట్లు విష్ణు వెల్లడించారు.
ఎంతో మంది మహిళ ఆర్టిస్టులను హీరోయిన్లను గౌరవించడం మన సాంప్రదాయం అంతేగాని వారి గురించి అసభ్యకరమైన వీడియోలు పెడితే మాత్రం వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఆ విషయంలో ఉపేక్షించేది లేదని విష్ణు యూట్యూబ్ ఛానల్ కు వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా యూట్యూబ్ ఛానల్ కోసం ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు విష్ణు వెల్లడించారు.
ఈ క్రమంలోనే విష్ణు మాట్లాడుతూ తెలుగు మీడియా ఎప్పుడు హద్దులు దాటలేదు తన కుటుంబం పట్ల,చిత్ర పరిశ్రమ పట్ల మీడియా ఎప్పుడు సానుకూలంగా ఉందని ఈ సందర్భంగా విష్ణు తెలుపుతూ యూట్యూబ్ ఛానల్ హెచ్చరికలు జారీ చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…